STOCKS

News


ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

Saturday 13th July 2019
news_main1562991720.png-27032

  • ఆగస్ట్‌ 6 నుంచి అంతర్జాతీయ సేవలు
  • ఢిల్లీ నుంచి సింగపూర్‌కు నిత్యం సర్వీసులు
  • 7న ముంబై నుంచి సింగపూర్‌కు

న్యూఢిల్లీ: టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్‌) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్‌ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి మొత్తం రెండు ఫ్లయిట్లను నడపనుంది. అంతర్జాతీయంగా మరిన్ని కేంద్రాలకు త్వరలోనే సర్వీసులను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇరువైపుల ప్రయాణానికి అన్ని చార్జీలతో కలిపి ప్రారంభ ధరలను ప్రకటించింది. ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లి, తిరిగి ఢిల్లీకి వచ్చేందుకు ఎకానమీ క్లాస్‌లో రూ.21,877, బిజినెస్‌ క్లాస్‌లో రూ.76,890గా నిర్ణయించింది. అలాగే, ముంబై నుంచి సింగపూర్‌కు, సింగపూర్‌ నుంచి ముంబైకి రానుపోను చార్జీని ఎకానమీ క్లాస్‌కు రూ.20,778, బిజినెస్‌ క్లాస్‌కు రూ.63,331గా నిర్ణయించింది. చాలా ముఖ్యమైన మార్కెట్‌ అయినందునే తొలుత సింగపూర్‌కు సర్వీసులు ఆరంభిస్తు‍న్నట్టు విస్తారా సీఈవో లెస్లీథాంగ్‌ తెలిపారు.



You may be interested

లాభాల్లోకి ట్రూజెట్‌!

Saturday 13th July 2019

గత అక్టోబరు నుంచి నిర్వహణ లాభాలు ప్రస్తుతం సంస్థ చేతిలో 5 విమానాలు  నవంబరు నాటికి ఈ సంఖ్య 10కి చేరుతుంది ఈశాన్యం సహా మరిన్ని ప్రాంతాలకు సర్వీసులు ‘అనుబంధ’ ఆదాయాలపైనా ఫోకస్‌ సీఎఫ్‌ఓ విశ్వనాథ్‌, ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగ కంపెనీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో... తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్‌ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ మాత్రం తొలిసారి లాభాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2018

విస్తరణలో గోద్రెజ్‌ ఇంటీరియో

Saturday 13th July 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫర్నీచర్‌ రంగ సంస్థ గోద్రెజ్‌ ఇంటీరియో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 2020 మార్చికల్లా కొత్తగా 30 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లు నెలకొల్పుతోంది. అలాగే డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా 70 షోరూంలు ప్రారంభిస్తున్నట్టు గోద్రెజ్‌ ఇంటీరియో మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబోధ్‌ కుమార్‌ మెహతా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 16 కేంద్రాలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కంపెనీకి

Most from this category