STOCKS

News


వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయం:ఏఏఐ

Thursday 28th February 2019
news_main1551337605.png-24373

హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్‌ సభ్యులు ఎస్‌.సురేశ్‌ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ తెలిపారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్‌ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్‌ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది.



You may be interested

ధరల నియంత్రణల్లోకి కేన్సర్‌ ఔషధాలు

Thursday 28th February 2019

నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 40 డగ్స్‌కు చోటు న్యూఢిల్లీ: కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించే నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలను ధరల నియంత్రణల విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల విక్రయ ధరలపై 30 శాతం మార్జిన్‌ను గరిష్ట పరిమితిగా విధించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల నిర్ణయాక మండలి (ఎన్‌పీపీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఔషధ విభాగం తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ‘‘ఔషధ

తొలి దేశీ 4జీ సెమీకండక్టర్ చిప్‌ ఆవిష్కరణ

Thursday 28th February 2019

తయారు చేసిన సిగ్నల్‌చిప్ సంస్థ న్యూఢిల్లీ: 4జీ, ఎల్‌టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్

Most from this category