STOCKS

News


పెరిగిన విమ్టా లాభం

Tuesday 13th November 2018
news_main1542086183.png-21943

హైదరాబాద్‌: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్‌ నికర లాభం పెరిగింది. గత ఆర్ధిక సంవత్సంలో రూ.4.33 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని ఆర్జించగా.. ఇప్పుడది రూ.6.97 కోట్లకు పెరిగింది. ఇక, మొత్తం ఆదాయం రూ.53.82 కోట్లను నమోదు చేయగా.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.43.67 కోట్లుగా ఉంది.
–––
తగ్గిన ఎన్‌సీఎల్‌ లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్ధిక సంవత్సరం ఫలితాల్లో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం తగ్గింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ2 స్టాండలోన్‌ ఫలితాల్లో లాభం రూ.9.72 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7.69 కోట్లకు పడిపోయింది. ఇక, మొత్తం ఆదాయం రూ.188 కోట్ల నుంచి రూ.228.79 కోట్లకు పెరిగింది.
––
తగ్గిన ఎన్‌ఏసీఎల్‌ లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్ధిక సంవత్సర ఫలితాల్లో ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ (నాగార్జున అగ్రికెమ్‌) లాభం తగ్గింది. 2017 క్యూ2లో రూ.7.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా.. ఇప్పుడది రూ.5 కోట్లకు తగ్గింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.290.92 కోట్ల కాగా గతేడాది ఇది రూ.309 కోట్లుగా ఉంది.



You may be interested

గ్లోబల్‌ గ్రోత్‌: వీటితో రిస్క్‌..

Tuesday 13th November 2018

ప్రపంచ వృద్ధికి రానున్న కాలంలో పలు సవాళ్లు ఎదురు కానున్నాయి. మరీముఖ్యంగా అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన అమెరికా, చైనా వంటి దేశాల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయని టీడీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ మితుల్‌ కొటెచా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.  అమెరికాలో ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం సరైన పనితీరు కబనర్చడం లేదని మితుల్‌ కొటెచా తెలిపారు.

ప్రధానితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్‌.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి. ఈ చర్చల నేపథ్యంలో

Most from this category