STOCKS

News


విజయ బ్యాంక్‌ లాభం 24శాతం

Tuesday 30th October 2018
Markets_main1540880203.png-21582

  • తగ్గిన మొండి బకాయిలు
  • 12 శాతం పెరిగిన మొత్తం ఆదాయం

బెంగళూరు: ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.140 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఆర్‌.ఎస్‌. శంకర నారాయణన్‌ తెలిపారు. గత క్యూ2లో రూ.3,501 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 12 శాతం వృద్ధితో రూ.3,931 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
రుణ నాణ్యత మెరుగుపడిందని శంకర నారాయణన్‌ తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.06 శాతం నుంచి 5.86 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. అలాగే నికర మొండి బకాయిలు 4.86 శాతం నుంచి 3.81 శాతానికి చేరాయని వివరించారు. గత ఐదేళ్లలో మొండి బకాయిలు తగ్గడం ఇదే మొదటిసారని, తమ బ్యాంక్‌ రికవరీ బాట పట్టిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుందని వివరించారు.  ఈ బ్యాంక్‌ దేనా బ్యాంక్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమవుతోంది. రైతు రుణ మాఫీ విషయంలో కర్నాటక ప్రభుత్వానికి ఇతోధికంగా తోడ్పడుతామని నారాయణన్‌ పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ అంశంలో కర్నాటక ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.



You may be interested

టాటా పవర్‌... ‘పవర్‌’

Tuesday 30th October 2018

ఎన్‌సీడీల ద్వారా రూ.5,500 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: టాటా పవర్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 85 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.393 కోట్లకు పెరిగిందని టాటా పవర్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.274 కోట్ల రెగ్యులేటరీ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత

విదేశాలకూ వైశ్యా బిజినెస్‌ నెట్‌వర్క్‌

Tuesday 30th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన వైశ్య బిజినెస్‌ నెట్‌వర్క్‌ (వీబీఎన్‌)... విదేశాల్లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం 130 మంది సభ్యులతో రెండు చాప్టర్లను విజయవంతంగా కొనసాగిస్తున్నట్టు వీబీఎన్‌ ఫౌండర్‌ శివకుమార్‌ ఇమ్మడి సోమవారం మీడియాకు తెలిపారు. 2022 నాటికి భారత్‌లో 30, విదేశాల్లో 5 చాప్టర్లుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ సభ్యుల రెఫరల్స్‌ ద్వారా గతేడాది రూ.1,000 కోట్ల వ్యాపారం జరిగిందని వీబీఎన్‌ సభ్యులు కౌటికె విఠల్‌

Most from this category