STOCKS

News


చందా కొచర్‌పై చర్యలు తీసుకోవాలి

Thursday 13th September 2018
news_main1536814629.png-20228

వదోదర: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో ఆరోపణల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ 24వ వార్షిక సర్వసభ్య సమావేశం వాడి,వేడిగా జరిగింది. అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఈవో చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణల మీద స్పష్టతనివ్వాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని షేర్‌హోల్డర్లు డిమాండ్ చేశారు. బ్యాంక్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు, ప్రమాణాలపై కొందరు షేర్‌హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చందా కొచర్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. సీఈవో, ఎండీగా కొనసాగుతున్నప్పటికీ జూన్‌ నుంచి ఆమె సెలవులో ఉన్నారు. మరోవైపు, బ్యాంక్ బోర్డులో ప్రభుత్వ నామినీ లోక్‌ రంజన్‌ కూడా దీనికి హాజరు కాలేదు. 
కొత్త చైర్మన్‌గా నియమితులైన జీసీ చతుర్వేది ఆధ్వర్యంలో ఏజీఎం దాదాపు గంటపైగా సాగింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలివ్వడం, ఆ గ్రూప్ చీఫ్ వేణుగోపాల్ ధూత్‌.. చందా కొచర్ భర్త దీపక్‌ కొచర్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టడం తదితర అంశాలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్విడ్‌ ప్రో కో వ్యవహారంపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. 



You may be interested

జీవిత బీమా పాలసీల్లో వృద్ధి

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: నూతన జీవిత బీమా పాలసీ ప్రీమియం వసూళ్లు ఆగస్టులో 6.43 శాతం పెరిగి రూ.18,639.29 కోట్లుగా నమోదైనట్లు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. గతేడాది ఇదే కాలానికి రూ.17,513.59 కోట్ల నూతన ప్రీమియం వసూళ్లు నమోదయ్యాయి. దేశీయంగా ఉన్న 24 జీవిత బీమా సంస్థలలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ నూతన పాలసీ ప్రీమియం వసూళ్లు 1.94 శాతం తగ్గుదలను నమోదుచేయగా, మిగిలిన 23

ఆర్థిక రంగంపై ఎల్లుండి  ప్రధాని సమీక్ష!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. వేగంగా పడిపోతున్న రూపాయికి కళ్లెం వేసే విషయంలో అవసరమైన చర్యలపైనా చర్చించే అవకాశాలున్నాయని తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, ప్రధాని ఆర్థిక సలహా మండి చైర్మన్‌ బిబేక్‌ దేబ్రాయ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తదితరులు

Most from this category