STOCKS

News


రూ.1200కోట్లకు ‘ఆన్‌లైన్‌ మాట్రిమోనీ’

Thursday 25th April 2019
news_main1556154691.png-25336

వీడియో మాట్రిమోనీని ఆరంభించిన ‘దిల్‌కే రిస్తే’  

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ వచ్చే ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుతుందని ‘దిల్‌కే రిస్తే’ వ్యవస్థాపకుడు సురేశ్‌ నాయర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి వీడియో మాట్రిమోనీ సైట్‌ ‘దిల్‌కేరిస్తే డాట్‌కామ్‌’ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ‘‘ ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ విలువ రూ.1,000 కోట్లని, ఇందులో దాదాపు 80 శాతం వాటా టాప్‌ 3 సైట్లదేనని (భారత్‌ మాట్రిమోని, షాదీ, జీవన్‌సాథీ) చెప్పారు. మాట్రిమోనీ మార్కెట్లో ప్రస్తుతం దాదాపు 43 లక్షల మంది సభ్యులున్నారన్నారు. వచ్చే రెండేళ్లలో మొత్తం మాట్రిమోనీ మార్కెట్‌ రెవెన్యూలో 10 శాతం, సబ్‌స్క్రైబర్లలో 25 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో జరిగే వివాహాల్లో మాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వివాహాల శాతం కేవలం 6 శాతమేనని, ఈ రంగంలో విస్తరించేందుకు అపార అవకాశముందని వివరించారు. మాట్రిమోనీ సైట్‌ ప్రొఫైల్స్‌లో 60 శాతం వాటా మగవారిది కాగా, 40 శాతం ప్రొఫైల్స్‌ మహిళలవని తెలిపారు.  

తొలి వీడియో మాట్రిమోనీ సైట్‌ 
ఈ మార్కెట్లో ఇంతవరకు వీడియో ఆధారిత ప్రొఫైల్స్‌తో కూడిన మాట్రిమోనీ సైట్‌ లేదని, అందుకే తాము ప్రవేశపెట్టామని సురేశ్‌ నాయర్‌ తెలిపారు. తమ సైట్లో మొదటి మూడు నెలలు రిజిస్ట్రేషన్‌ ఉచితమన్నారు. సభ్యులు సొంతంగా 1– 1.5 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ప్రొఫెషనల్‌ వీడియో కావాలంటే రూ.6వేలు ఫీజుతో తాము తయారు చేసి అప్‌లోడ్‌ చేస్తామన్నారు. ఇందుకోసం నగరంలో తాము 11 స్టూడియోలు ఏర్పరిచామన్నారు. వీడియోలతో సభ్యుల గురించి అవతలవారికి సరైన అవగాహన వస్తుందన్నారు. తమ సైట్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెంబర్‌ డిస్‌ప్లే చేయకుండా వీడియో కాలింగ్, ఆన్‌లైన్‌ చాటింగ్, హారోస్కోప్‌ మ్యాచింగ్‌ తదితర ప్రత్యేక సేవలను తమ సైట్లో అందిస్తున్నామన్నారు. తొలి ఏడాదిలో కనీసం 30వేల సభ్యులను లకి‡్ష్యస్తున్నామని తెలిపారు.   



You may be interested

గురువారం వార్త‌ల్లోని షేర్లు

Thursday 25th April 2019

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మయ్యే షేర్ల వివ‌రాలు ఇండియాబుల్స్  హౌసింగ్ ఫైనాన్స్:- మార్చి త్రైమాసికంలో నిక‌రలాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి. ఎస్‌బీఐ:-  ప్రస్తుత ఆర్థిక

ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ

Thursday 25th April 2019

కేంద్రానికి 100 శాతం వాటాలు ముంబై: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)లో రిజర్వ్‌ బ్యాంక్‌ తనకున్న పూర్తి వాటాలను కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. అటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) కూడా వాటాలన్నింటినీ విక్రయించడంతో ఎన్‌హెచ్‌బీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి చేరినట్లయింది. ఆర్‌బీఐ వాటాల విలువ రూ.1,450 కోట్లు కాగా, నాబార్డ్‌ వాటాల విలువ రూ. 20 కోట్లు. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న

Most from this category