STOCKS

News


వాహన బీమా ప్రీమియం ప్రియం

Friday 7th June 2019
news_main1559888716.png-26150

  • 21 శాతం దాకా పెంపు
  • జూన్ 16 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనాల బీమా మరింత భారం చేసే నిబంధనలు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం వివిధ రకాల వాహనాలకు తప్పనిసరైన థర్డ్‌ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 21 శాతం దాకా పెరగనుంది. సాదారణంగా టీపీ ఇన్సూరెన్స్ కవర్ రేట్లు ఏటా ఏప్రిల్ 1న సవరిస్తారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం జూన్ 16 నుంచి అమల్లోకి వస్తాయి. ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం చిన్న కార్లకు (1,000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవి) టీపీ ఇకపై రూ. 2,072గా ఉంటుంది. ఇప్పుడున్న రూ. 1,850తో పోలిస్తే ఇది 12 శాతం అధికం. మరోవైపు, 1,000 సీసీ - 1,500 సీసీ ఇంజిన్‌ సామర్ధ్యం గల కార్లన్‌బీమా ప్రీమియం 12.5 శాతం పెరిగి రూ. 3,221కి చేరుతుంది. అయితే, అంతకు మించిన ఇంజిన్ సామర్ధ్యం (1,500 సీసీకి మించి) గల కార్లపై టీపీ ప్రీమియం గతంలోలాగానే రూ. 7,890గా కొనసాగుతుంది. 
ద్విచక్ర వాహనాలకు 13% పైగా పెంపు...
75 సీసీ కన్నా తక్కువ ఇంజిన్ సామర్ధ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు టీపీ ప్రీమియం 12.88 శాతం పెరిగి రూ. 482గా ఉంటుంది. 75 సీసీ-150 సీసీ దాకా ఇంజిన్ సామర్ధ్యం ఉన్న వాటిపై ప్రీమియం 752గా ఉంటుంది. 150-350 సీసీ దాకా సామర్ధ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై అత్యధికంగా 21.11 శాతం మేర ప్రీమియం భారం కానుంది. ప్రస్తుతమున్న రూ. 985 నుంచి రూ. 1,193కి పెరుగుతుంది. సూపర్ బైక్‌ల (350 సీసీకి మించినవి) ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రజా రవాణా వాహనాలతో పాటు ప్రైవేట్ గూడ్స్ వాహనాలు, స్కూల్ బస్సులపై కూడా ఐఆర్‌డీఏఐ బీమా ప్రీమియం పెంచింది. అయితే, ఈరిక్షాలకు మాత్రం గత రేటే వర్తిస్తుంది. ఇక దీర్ఘకాలిక సింగిల్ ప్రీమియం రేట్లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కార్లకు సంబంధించి మూడేళ్ల వ్యవధికి, ద్విచక్ర వాహనాలపై అయిదేళ్ల వ్యవధికి దీర్ఘకాలిక ప్రీమియం వర్తిస్తుంది.  



You may be interested

భారత్‌కు రూ. 90వేల కోట్ల నష్టం

Friday 7th June 2019

ఎగుమతులు, దిగుమతుల్లో తప్పుడు బిల్లింగ్‌లే కారణం గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ నివేదిక న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల వాణిజ్య లావాదేవీల్లో తప్పుడు ఇన్‌వాయిస్‌ల కారణంగా 2016లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. పన్ను ఆదాయాలపరంగా వాటిల్లిన ఈ నష్టం సుమారు రూ. 90,000 కోట్లు (13 బిలియన్ డాలర్లు) ఉంటుందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఇది 2016లో వసూలైన మొత్తం ఆదాయంలో దాదాపు

విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!!

Friday 7th June 2019

జూలై 30న చైర్మన్‌గా పదవీ విరమణ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగింపు కుమారుడు రిషద్‌కు చైర్మన్‌గా బాధ్యతలు న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్‌ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ‍ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి

Most from this category