STOCKS

News


వేదాంత లాభం 34 శాతం డౌన్‌

Thursday 1st November 2018
news_main1541052790.png-21632

- ఒక్కో షేర్‌కు రూ.17 మథ్యంతర డివిడెండ్‌
- రికార్డు తేదీ ఈ నెల 10

న్యూఢిల్లీ: లోహ, మైనింగ్‌ దిగ్గజం వేదాంత నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 34 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,045 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,343 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,509 కోట్ల నుంచి రూ.23,297 కోట్లకు పెరిగిందని వేదాంత చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసన్‌ చెప్పారు. అల్యూమినియమ్‌ అమ్మకాలు అధికంగా ఉండటం, తల్వాండి సాబో పవర్‌ ప్లాంట్‌ విద్యుదుత్పత్తి  పెరగడం దీనికి కారణాలన్నారు. జింక్‌ ఇండియా, జింక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థల అమ్మకాలు తక్కువగా ఉండటం, ట్యుటికోరన్‌ స్మెల్టర్‌ మూసివేత వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్‌ కంపెనీ కొనుగోలు, కరెన్సీ పతనం, కమోడిటీల ధరలు పెరగడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపించాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.18,854 కోట్ల నుంచి రూ.20,999 కోట్లకు పెరిగాయన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.17 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.6,320 కోట్లని పేర్కొన్నారు. ఈ డివిడెండ్‌కు రికార్డ్‌ డేట్‌గా ఈ నెల 10ని నిర్ణయించామని తెలియజేశారు.
ఎబిటా రూ.5,342 కోట్లు...
స్టాండ్అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 43 శాతం తగ్గి రూ.1,135 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం తక్కువగా రావడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు. ఎబిటా 8 శాతం తగ్గి రూ.5,342 కోట్లకు చేరింది. ముడి పదార్ధాల ధరలు పెరగడం, జింక్‌ అమ్మకాలు తక్కువగా ఉండడం దీనికి కారణాలని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.  నిర్వహణ మార్జిన్‌ 3.4 శాతం తగ్గి 22.9 శాతానికి చేరింది. కంపెనీ ఆస్తి, అప్పుల పట్టీ పటిష్టంగా ఉందని, నికర రుణ భారం రూ.3,553 కోట్లు తగ్గిందని తెలిపారు. అమ్మకాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ వ్యాపార విభాగాల అమ్మకాలు, లాభదాయకత  ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో మరింతగా పుంజుకుంటాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.You may be interested

హెరిటేజ్‌ లాభం 34శాతం డౌన్‌

Thursday 1st November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్‌- సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,593 కోట్లు

Thursday 1st November 2018

28 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,020 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,593 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.26,846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు ఎగసింది. మొత్తం

Most from this category