STOCKS

News


ఎలక్ట్రోస్టీల్‌ విస్తరణపై 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి

Saturday 25th August 2018
news_main1535171679.png-19624

ముంబై: ఇటీవలే కొనుగోలు చేసిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌ ఉత్పత్తి సామర్ధ్య విస్తరణపై 300-400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వేదాంత సంస్థ చైర్మన్ నవీన్ అగర్వాల్ వెల్లడించారు. వివిధ ప్రాజెక్టులపై వచ్చే మూడేళ్లలో ఇన్వెస్ట్ చేయబోయే 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56,000 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో ఇది భాగంగా ఉంటుందని ఆయన తెలిపారు. "ప్రస్తుతం ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌ పూర్తి ప్రాసెసింగ్ సామర్థ్యం వార్షికంగా 1.5 మిలియన్ టన్నులుగా (ఎంటీపీఏ) ఉంది. త్వరలో దీన్ని 2.5 ఎంటీపీఏకి పెంచుకునే దిశగా 300-400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాం" అని కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులకు చెప్పారు. తూత్తుకుడి (తమిళనాడు) ప్లాంటును సాధ్యమైనంత త్వరగా మళ్లీ ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్లాంటు విస్తరణపై తర్వాత దశలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగిస్తోందంటూ స్థానికులు ఆందోళనకు దిగడం, పోలీస్ కాల్పుల్లో 13 మంది మృతి చెందడం, తదనంతర పరిణామాలతో ప్లాంటు మూతబడిన సంగతి తెలిసిందే. 
భారీ పెట్టుబడి ప్రణాళికలు..
వచ్చే మూడేళ్లలో వివిధ ప్రాజెక్టులపై 8 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని వేదాంత నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 2,00,000 బ్యారెళ్లుగా ఉన్న చమురు, గ్యాస్ వ్యాపారాన్ని 4,00,000 బ్యారెళ్లకు పెంచుకోనుంది. అలాగే జింక్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 1.5 ఎంటీపీఏకి పెంచుకోనుంది. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని సంస్థ అంతర్గతంగా సమకూర్చుకోనున్నట్లు నవీన్ అగర్వాల్ తెలిపారు. ఈ ప్రణాళికలన్నీ అమలైన తర్వాత సంస్థ వ్యాపార పరిమాణం 50 శాతం పైగా పెరుగుతుందని ఆయన వివరించారు. శుక్రవారం బీఎస్‌ఈలో సంస్థ షేరు 4.26 శాతం ఎగిసి రూ. 223.95 వద్ద ముగిసింది. You may be interested

మారుతీ అసిస్టెన్స్‌ మీవెంటే..

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: నడిరోడ్డుపైన ఒక్కసారిగా కారు ఆగిపోతే కలిగే అసౌకర్యాన్ని తమ కస్టమర్ల దరిచేరనివ్వకుండా చూడాలని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) భావిస్తోంది. ఇందుకోసం కారు ఎక్కడ ఆగిపోయినా వెంటనే వాలిపోయే తక్షణ సహాయ బృందాలను శుక్రవారం ప్రారంభించింది. క్విక్‌ రెస్పాన్స్‌ టీం (క్యూఆర్‌టీ) పేరిట ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై తమ బృందాలు సేవలందిస్తాయని కంపెనీ ప్రకటించింది. మొదటి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 250 నగరాలలో 350 బైక్‌ల

పీఎస్‌బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్‌బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి. పద్మనాభన్ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్‌బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సీఈపీఆర్‌) నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ

Most from this category