STOCKS

News


వేదాంత రీసోర్సెస్‌ ఎబిటాలో 26 శాతం వృద్ధి

Tuesday 7th August 2018
news_main1533618926.png-18999

న్యూఢిల్లీ: వేదాంత రీసోర్సెస్‌ ఎబిటా జూన్‌ క్వార్టర్లో 26 శాతం పెరిగి 983 మిలిన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 778 మిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. త్రైమాసిక ఫలితాలను కంపెనీ లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు సమర్పించింది. వేదాంత లిమిటెడ్‌కు ఇది మాతృ సంస్థ. కమోడిటీ ధరలు అధికంగా ఉండడం, అధిక విక్రయాలతో ఎబిటా వృద్ధి చెందినట్టు కంపెనీ తెలిపింది. గ్రూపు ఆదాయం 14.9 శాతం పెరిగి ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 3,551 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కాపర్‌ వ్యాపారంలో 15 మిలియన్‌ డాలర్ల నష్టాలను ప్రకటించింది. 



You may be interested

విదేశాల్లో భారత ‘వంటిల్లు’!

Tuesday 7th August 2018

 భారత రెస్టారెంట్లకు విదేశాల్లో ఎర్ర తివాచీ...  త్వరలోనే లండన్‌, న్యూయార్క్‌లలో సంజీవ్‌ కపూర్‌ హోటళ్లు  అమెరికాలో లైట్ బైట్ పంజాబీ రుచులు న్యూఢిల్లీ: పంజాబీ చికెన్‌ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్‌... తమిళనాడు సాంబార్‌ ఇడ్లీ... హైదరాబాద్‌ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఇప్పుడు ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భరతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండడంతో

మరింత పెరిగిన సిండికేట్‌ బ్యాంకు నష్టాలు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సిండికేట్‌ బ్యాంకు నష్టాలు జూన్‌ త్రైమాసికంలో మరింత విస్తృతం అయ్యాయి. రూ.1,282 కోట్ల నష్టాన్ని బ్యాంకు ఈ కాలంలో చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.263 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం రూ.5,637 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,171 కోట్లు. వడ్డీ ఆదాయం రూ.5,484 కోట్ల నుంచి రూ.5,257 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, ఆర్‌బీఐ వద్ద, ఇతర ఇంటర్‌ బ్యాంకు వేదికల

Most from this category