STOCKS

News


వేదాంత లాభం రూ.1574 కోట్లు

Friday 1st February 2019
Markets_main1549006210.png-23938

-26 శాతం క్షీణత
-పెరిగిన వ్యయాలు, కమోడిటీల ధరల ప్రభావం

న్యూఢిల్లీ:  వేదాంత కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,574 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.2,114 కోట్ల నికర లాభం వచ్చిందని, 26 శాతం క్షీణత నమోదైందని వేదాంత తెలిపింది. వ్యయాలు అధికం కావడం, కమోడిటీ ధరలు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.24,842 కోట్ల నుంచి రూ.25,067 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.20,456 కోట్ల నుంచి రూ.21,589 కోట్లకు పెరిగాయని వివరించింది. గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి తమ రుణ భారం రూ.39,531 కోట్లుగా ఉందని పేర్కొంది.
షెడ్యూల్‌ ప్రకారమే పునర్వ్యస్థీకరణ పనులు...
ఈ క్యూ3లో పటిష్టమైన నిర్వహణ, ఆర్థిక ఫలితాలను సాధించామని వేదాంత పేర్కొంది. రికార్డ్‌ స్థాయిలో అల్యూమినా, జింక్‌, వెండిల  ఉత్పత్తి జరిగిందని, ఉక్కు వ్యాపారంలో మంచి మార్జిన్లు సాధించామని, రాగి వ్యాపారంలో ఇటీవలి పరిణామాలు తమ కంపెనీకి సానుకూలమేనని వివరించింది. కంపెనీ పునర్వ్యస్థీకరణ పనులు షెడ్యూల్‌​‍ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొంది.
సీఈఓగా శ్రీనివాసన్‌
శ్రీనివాసన్‌ వెంకటకృష్ణన్‌ను హోల్‌-టైమ్‌ డైరెక్టర్‌గా నియమించామని, వచ్చే నెల 1 నుంచి ఆయన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని కంపెనీ పేర్కొంది.



You may be interested

దిద్దుబాటు చర్యల చట్రం నుంచి మూడు బ్యాంకులకు విముక్తి

Friday 1st February 2019

- బీఓఐ, బీఓఎం, ఓబీసీలపై  ఆంక్షలు తొలగించిన ఆర్‌బీఐ ముంబై:  మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కార దిశలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలోకి (పీసీఏ- ప్రాంట్‌ కరెక్టివ్‌ యాక్సన్‌) వెళ్లిన 11 బ్యాంకుల్లో మూడింటికి విముక్తి లభించింది. రుణాలు ఇవ్వడానికి సంబంధించి ఈ మూడు బ్యాంకులపై ఉన్న ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసింది. వీటిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) ఓరియెంటల్‌ బ్యాంక్‌

ఎయిర్‌టెల్‌ లాభం 72శాతం డౌన్‌

Friday 1st February 2019

ఈ క్యూ3లో నికర లాభం రూ.86 కోట్లు -1 శాతం వృద్ధితో రూ.20,519 కోట్లకు మొత్తం ఆదాయం -భారత్‌లో తగ్గిన వినియోగదారులు, పెరిగిన డేటా న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో

Most from this category