STOCKS

News


ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో ఉన్నాం

Saturday 20th October 2018
news_main1540010066.png-21305

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో వేదాంత కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. బిడ్‌ మొత్తాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘స్టీల్‌ ఉత్పత్తికి అవసరమైన ముడి ఇనుము, సహజవాయువు ఉత్పత్తి చేసే వేదాంత కంపెనీ, ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు అనువైనది. ఇది ఎస్సార్‌ స్టీల్‌కు కూడా అనుకూలమే’’ అన్నారాయన. బ్యాంకులకు రూ.50,800 కోట్ల రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ కేసు... ఎన్‌సీఎల్‌టీ దివాలా పరిష్కారం కిందకు వెళ్లింది. దీంతో ఈ కంపెనీ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌, రష్యాకు చెందిన వీటీబీ క్యాపిటల్‌ ఆధ్వర్యంలోని న్యుమెటల్‌, వేదాంత లిమిటెడ్‌ తొలి రౌండ్‌ బిడ్డింగ్‌లో పోటీ పడ్డాయి. వేదాంత రూ.35,000-36,000 కోట్లను ఆఫర్‌ చేసింది. ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌ కంపెనీల ఆఫర్‌ కంటే వేదాంత ఇవ్వజూపినదే ఎక్కువ. అయితే, ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌ అర్హత విషయమై వివాదం నెలకొనడం, అది కోర్టు ముందుకు వెళ్లడంతో... రెండో రౌండ్‌లో న్యుమెటల్‌ తన ఆఫర్‌ను రూ.37,000 కోట్లకు పెంచింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ రూ.42,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇదే మొత్తం ఇవ్వడానికి తామూ సిద్ధమని న్యుమెటల్‌ తెలియజేసింది. ఇది సుప్రీంకోర్టు ముందుకు చేరడంతో... ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌ భారత్‌లోని తన గ్రూపు కంపెనీల బకాయిలను చెల్లించాలని కోరింది. అప్పుడే ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు అర్హత లభిస్తుందని స్పష్టం చేసింది.
అన్నింటికీ సిద్ధమే... ‍ 
‘‘మొదటి దశ బిడ్డింగ్‌ ఆధారమని పేర్కొంటూ మూడు కంపెనీలను కోర్టు అనుమతించింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ బకాయిలు తీర్చివేసి పోటీలోకి రావాల్సి ఉంటుంది. న్యుమెటల్‌ మిగిలి ఉన్న రుణాలను చెల్లించేసి పోటీ పడాల్సి ఉంటుంది. వేదాంత తన తొలి రౌండ్‌ బిడ్‌తో ఇప్పటికీ అర్హత కలిగి ఉంది. మేం పోటీలోనే ఉన్నాం. మేం కచ్చితంగా ఆసక్తితో ఉన్నాం. కానీ, దీని కోసం యుద్ధం కోరుకోవడం లేదు. నాకు కావాల్సినంత ఉంది. సంతోషంగా ఉన్నా. అందుకే కోర్టుకు వెళ్లలేదు’’ అని అనిల్‌ అగర్వాల్‌ వివరించారు. ఆఫర్‌ ధర పెంచేందుకు సిద్ధమేనా? అన్న ప్రశ్నకు... అన్నింటికీ సిద్ధమేనని, పోటీలోని మరో రెండు సంస్థలు సుప్రీంకోర్టు పెట్టిన షరతు మేరకు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలన్నారు. ఎలక్ట్రోస్టీల్‌ కోనుగోలుతో ఇప్పటికే స్టీల్‌ రంగంలోకి అడుగుపెట్టినట్టు అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. You may be interested

ప్రాంతీయ విమానాల్లో డేటా సేవలు..!

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: దేశ సరిహద్దులలోని నౌకలు, విమానాలలో డేటా సేవలను అనుమతించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత ఇన్‌-ప్లైట్‌ కనెక్టివిటీ మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని.. వాయిస్‌, డేటా అనుమతిని పరిగణనలోకి తీసుకుంటున్నామని టెలికాం శాఖ తెలియజేసింది. దేశ సరిహద్దుల అవతల వినియోగానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నందున సేవలు సరిహద్దులకు లోబడే ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని వెలువరించే ముందుగా మార్పుల నిమిత్తం

గృహరుణాలకు ఎన్‌బీఎఫ్‌సీ దెబ్బ

Saturday 20th October 2018

ముంబై: నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండటం.. వాటిపై ఆధారపడిన పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, ద్విచక్ర వాహనాలు మొదలైన విభాగాలపై ఇది మరింతగా కనిపించనుంది. వివిధ కన్సల్టెన్సీలు విడుదల చేసిన నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిధుల కొరత కారణంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల.. గృహ రుణాల మంజూరీ కార్యకలాపాలు మందగించే అవకాశాలున్నాయని జపనీస్ బ్రోకరేజి సంస్థ నొమురా పేర్కొంది. ఇప్పటికే

Most from this category