STOCKS

News


నాట్కో కొత్తూరు యూనిట్‌లో ఉల్లంఘనలు

Friday 7th June 2019
news_main1559889676.png-26153

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మాకు చెందిన కొత్తూరులోని ఫార్ములేషన్‌ యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టింది. మే 30 నుంచి జూన్‌ 5 వరకు జరిగిన ఈ తనిఖీల్లో తయారీ కేంద్రంలో పలు ఉల్లంఘనలు జరిగినట్టు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తొమ్మిది అంశాలను లేవనెత్తుతూ ఫెడరల్‌ ఫుడ్‌, డ్రగ్‌, కాస్మెటిక్‌ యాక్టు కింద కంపెనీకి ఫామ్‌-483 జారీ చేశారు. ఎఫ్‌డీఏ లేవనెత్తిన అంశాలకు తాము 15 రోజుల్లోగా తగు సమాధానం ఇవ్వనున్నట్లు కంపెనీ ఎక్సే‍్ఛంజీలకు తెలియజేసింది. 



You may be interested

ఆగిపోయిన ఫియట్‌ క్రిస్లర్‌, రెనోల విలీనం

Friday 7th June 2019

పారిస్: ప్రముఖ వాహన తయారీ కంపెనీలైన ఫియట్‌ క్రిస్లర్‌, రెనో సంస్థల మధ్య విలీన ఒప్పందం వీగిపోయింది. ఫ్రాన్స్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలిన ప్రతిపాదనను తిర‌స్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఫియట్‌ క్రిస్లర్‌ గురువారం ప్రకటించింది. గతనెల్లో ఈ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్‌లోని రెనో ప్రధానకార్యాలయంలో ఇరు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సమావేశమై.. తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయ పరిస్థితులు

పారదర్శక విధానాలు అమలు చేయండి

Friday 7th June 2019

తయారీ రంగ వృద్ధిపై రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గోయల్‌ సూచన సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి తావులేని పారదర్శక విధానాలు అమలు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు, దేశీ తయారీ రంగ ఎగుమతుల సంస్థలు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్, సబ్సీడీల మీద ఆధారపడుకుండా స్వీయ వృద్ధిపై దృష్టి సారించాలన్నారు. దేశంలో తయారీ రంగం వృద్ధి,

Most from this category