STOCKS

News


పట్టణీకరణ వినూత్నంగా ఉండాలి: అమితాబ్‌ కాంత్‌

Thursday 13th December 2018
news_main1544677121.png-22879

న్యూఢిల్లీ: దేశంలో పట్టణీకరణ చాలా వినూత్నంగా, ఎల్లకాలం నిలిచేలా ఉండాలని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెప్పారు. పాశ్చాత్య సమాజంలో మాదిరిగా పట్టణీకరణలో తప్పులకు అవకాశం ఇవ్వరాదని చెప్పారాయన. ‘‘భూమిపై 3 శాతం స్థలంలోనే పట్టణాలు విస్తరించి ఉన్నాయి. కానీ, ప్రపంచ జీడీపీలో వీటి వాటా 84 శాతంగా ఉంది’’ అని కాంత్‌ చెప్పారు. ‘ఐటీసీ సస్టెయిన్‌బిలిటీ అవార్డ్స్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాల్లో పట్ణీకరణ ఎంతో కాలుష్యకారకంగా ఉందన్నారు. ‘‘భారత్‌లో పట్టణీకరణ ఇప్పుడే మొదలైంది. ఇది ఎంతో వినూత్నంగా, ఎల్లకాలం కొనసాగేలా ఉండాలి. పాశ్చాత​సమాజం చేసిన తప్పులు ఇక్కడ పునరావృతం కాకూడదు’’ అని కాంత్‌ సూచించారు. ప్రతి నిమిషానికి దేశంలో 30 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వస్తున్నట్లు చెప్పారాయన. ‘‘స్వతంత్రంగా, చిరకాలం ఉపయోగించగల ఉత్పత్తుల కోసం ప్రపంచం చూస్తోంది. వీటికోసం కాస్తంత ఎక్కువ ధర చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది. అందుకే భారత్‌ పునరుత్పాదక ఇంధనాలకు సారథ్యం వహిస్తోంది’’ అని చెప్పారాయన.



You may be interested

ఆర్‌బీఐ స్వతంత్రత, విశ్వసనీయత కాపాడతా

Thursday 13th December 2018

ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడడంతోపాటు విశ్వసనీయ, సమగ్రతను నిలబెట్టే ప్రయత్నం చేస్తానని నూతన గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ స్పష్టంచేశారు. ప్రభుత్వంతో పాటు ఆయా అంశాలతో ముడిపడి ఉన్న ప్రతి భాగస్వామి అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుంటాని, ఆయా అంశాల పరిష్కారానికి సంప్రతింపుల విధానాన్ని అనుసరిస్తానని చెప్పారు. ఆధునికతతో కూడిన నేటి కాలంలో నిర్ణయ ప్రక్రియలో సంక్లిష్టతలు దృష్ట్యా భాగస్వాములతో సంప్రతించడమనేది ఆర్‌బీఐ ప్రాథమిక నిర్వహణలో భాగమన్నారు. ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మిక రాజీనామాతో

‘నాగార్జున ఆయిల్‌’ ఆస్తుల అమ్మకం

Thursday 13th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాగార్జున ఆయిల్‌ రిఫైనరీకి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అనుబంధ కంపెనీ అయిన నాగార్జున ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌వోసీఎల్‌) ఆస్తులను విక్రయించాల్సిందిగా (లిక్విడేషన్‌) ఎన్‌సీఎల్‌టీ చెన్నై బెంచ్‌ తీర్పు వెలువరించింది. ఎన్‌వోసీఎల్‌కు మొత్తం రూ.9,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో 15 బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.8,000 కోట్లు. హల్దియా పెట్రోకెమికల్స్‌, గల్ఫ్‌ పెట్రోకెమికల్స్‌లు ఇప్పటికే పరిష్కార ప్రణాళికతో ముందుకొచ్చాయి. అయితే

Most from this category