STOCKS

News


యునైటెడ్‌ బ్యాంక్‌ నష్టాలు పెరిగాయ్‌..

Tuesday 13th November 2018
news_main1542104105.png-21957

యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.883 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.344 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికంలోనూ రూ.388 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ2లో 17 శాతం వృద్ధితో రూ.376 కోట్ల నుంచి రూ.442 కోట్లకు పెరిగింది. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 22.73 శాతం నుంచి 22.69 శాతానికి, నికర ఎన్‌పీఏలు 15.17 శాతం నుంచి 14.36 శాతానికి తగ్గాయి. విలువ ప్రకారం చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.15,169 కోట్ల నుంచి రూ.15,163 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.9,233 కోట్ల నుంచి రూ.8,658 కోట్లకు దిగివచ్చాయి. కేటాయింపులు రూ.1,481 కోట్లకు చేరాయి. డిపాజిట్లు వార్షికంగా చూస్తే 2.89 శాతం పెరిగాయి. 

క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 2.51 శాతం పెరుగుదలతో రూ.12.25 వద్ద ముగిసింది. 



You may be interested

అపోలో టైర్స్‌ లాభం 4% అప్‌

Tuesday 13th November 2018

అపోలో టైర్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) రూ.146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.140 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంటే నికర లాభం 4 శాతంమేర పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,269 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.3,496 కోట్లుగా ఉంది.  ఆర్థిక ఫలితాల

క్యూ2 లాభం 100%పైగా పెరిగిన కంపెనీలివే...

Tuesday 13th November 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికపు ఎర్నింగ్స్‌ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. నిఫ్టీ-50లో 46 కంపెనీలు, సెన్సెక్స్‌ 30 కంపెనీల్లో 27 ఇప్పటికే ఫలితాలను ప్రకటించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇప్పటి దాకా 1,100 కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించాయి. ఇందులో 92 కంపెనీల నికర లాభం వార్షిక ప్రాతిపదికన 100 శాతానికిపైగా ఎగసింది.  గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లాభం ఏకంగా 97 రెట్లు (9,000 శాతానికి పైగా) పెరిగింది. డీఎల్‌ఎఫ్‌, ఓరియెంటల్‌ హోటల్స్‌,

Most from this category