STOCKS

News


యూనియన్‌ బ్యాంకు లాభంలో 12 శాతం వృద్ధి

Saturday 11th August 2018
news_main1533957570.png-19162

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.130 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.9,908 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.116 కోట్లు, ఆదాయం రూ.9,567 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు వడ్డీ ఆదాయంలో మంచి వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది జూన్‌ క్వార్టర్లో వడ్డీ ఆదాయం రూ.8,112 కోట్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.8,700‍ కోట్లకు పెరిగింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ.274 కోట్ల మేర వసూలైన ఎన్‌పీఏ వడ్డీ ఆదాయంలో కలసినట్టు బ్యాంకు పేర్కొంది. 
పెరిగిన బకాయిలు
ఆస్తుల నాణ్యత మాత్రం తగ్గింది. మొత్తం ఎన్‌పీఏలు 16 శాతానికి (రూ.50,972 కోట్లు) పెరిగాయి. నికర ఎన్‌పీఏలు కూడా రూ.25,508 కోట్లతో 8.7 శాతానికి చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం ఎన్‌పీఏలు 12.63 శాతం, నికర ఎన్‌పీఏలు 7.47 శాతం కావడం గమనార్హం. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ.1,703 కోట్ల నుంచి రూ.2,229 కోట్లకు పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయం మాత్రం 5.03 శాతం నుంచి 4.81 శాతానికి తగ్గింది. బ్యాంకుల రుణ ఆస్తులు రూ.4.88 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో యూనియన్‌ బ్యాంకు షేరు 4 శాతం లాభపడి బీఎఎస్‌ఈలో రూ.85.45 వద్ద క్లోజయింది. 



You may be interested

విలీనాల తర్వాత ఉద్యోగుల తొలగింపుల్లేవ్‌

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం ఉద్యోగులు ఎవరినీ తొలగించలేదని ఆర్థికశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ పేర్కొన్నారు. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎస్‌బీఐ మొత్తం 1,56,965 మంది ఉద్యోగులను, 1,56,964 మంది అధికారులను కలిగి ఉన్నట్లు మంత్రి లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. బ్యాంకులన్నీ కలిశాక 6,950 బ్రాంచీల విలీనం జరిగిందని తెలిపారు. 

టాటా స్టీల్‌కు భూషణ్‌ స్టీల్‌ను విక్రయించొచ్చు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా భూషణ్‌ స్టీల్‌ను టాటా స్టీల్‌కు విక్రయించాలన్న నిర్ణయాన్ని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) సమర్థించింది. ఐబీసీ చట్టంలోని సెక్షన్‌ 29ఏ ప్రకారం కంపెనీ కొనుగోలుకు బిడ్‌ వేసే అర్హత టాటా స్టీల్‌కు లేదన్న భూషన్‌ స్టీల్‌ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ వాదనను తోసిపుచ్చింది. ‘‘టాటా స్టీల్‌ విదేశీ సబ్సిడరీ అయిన టాటా స్టీల్‌ యూకేకు బ్రిటన్‌ కోర్టు ఈ ఏడాది

Most from this category