STOCKS

News


అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,014 కోట్లు

Thursday 25th April 2019
news_main1556151403.png-25328

ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ 

5.5 శాతం పెరిగిన షేర్‌   

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.9,554  కోట్లని తెలిపింది. ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.140 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.2,213 కోట్లుగా, ఎబిటా మార్జిన్‌ 21 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ తెలిపింది. బినానీ సిమెంట్స్‌ కంపెనీని విలీనం చేసుకున్నామని, అందుకే ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,224 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,432 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.32,461 కోట్ల నుంచి రూ.37,817 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది.You may be interested

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.138 కోట్లు

Thursday 25th April 2019

ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌   న్యూఢిల్లీ: మిడ్‌– సైజ్‌ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్‌ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్‌ అతుల్‌

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు విలీనం సెగ

Thursday 25th April 2019

అంతంతమాత్రంగానే ఆర్థిక పనితీరు ఫ్లాట్‌గా నికర లాభం  ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో  మధ్యంతర డివిడెండ్‌   న్యూఢిల్లీ: మొబైల్‌ టవర్ల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని

Most from this category