STOCKS

News


ఏపీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ భారీ ప్రాజెక్టు

Tuesday 11th June 2019
news_main1560227417.png-26214

  • మొత్తం పెట్టుబడి రూ.2,500 కోట్లు
  • కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్‌... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్‌ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్‌ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి.

అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీయే అల్ట్రాటెక్‌ సిమెంట్‌. సామర్థ్యం పరంగా భారత్‌లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది. 



You may be interested

ఏఆర్‌ఎల్‌ టైర్స్‌ కొత్త ప్లాంటు

Tuesday 11th June 2019

రూ.225 కోట్లతో సదాశివపేట వద్ద ఏర్పాటు కంపెనీ సీఎండీ అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏఆర్‌ఎల్‌ బ్రాండ్‌ పేరుతో టైర్లు, ట్యూబుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ అగర్వాల్‌ రబ్బర్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని సదాశివపేట వద్ద 40 ఎకరాల్లో రూ.225 కోట్లతో దీనిని నెలకొల్పుతోంది. 2020 ఏప్రిల్‌ నాటికి ఈ ప్లాంటు సిద్ధమవుతుందని అగర్వాల్‌ రబ్బర్‌ సీఎండీ అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌ సోమవారమిక్కడ మీడియాకు

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 11th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- నేషనల్‌ హై వే ఆథారిటీ నుంచి రూ.150 కోట్ల విలువైన రెండు ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. లుపిన్‌:- జూన్‌ 13న బోర్డు జరిగిన సమావేశంలో తన అనుబంధ సంస్థ న్యూక్లియర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ విలీన అంశంపై చర్చించనుంది.  ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సౌకర్యంపై ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ రేటింగ్‌ను ఇండియా ఎ(+)

Most from this category