ఉజ్జీవన్ ఫైనాన్షియల్ నికర లాభం రూ.45 కోట్లు
By Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (క్యూ1)లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. నిర్వాహణ ఆదాయం పెరిగిన కారణంగా నికర లాభం రూ.45 కోట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.74.90 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి ఆదాయం రూ.460 కోట్లకు చేరుకోగా.. అంతకుముందు ఇదేకాలంతో పోల్చితే 28.4 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 61 శాతం వృద్ధి చెంది రూ.222 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ 9.2 శాతం నుంచి 11.6 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది క్యూ1లో 6.2 శాతంగా ఉన్నటువంటి స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 2.7 శాతంగా తగ్గాయి. నికర ఎన్పీఏలు 2.3 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గినట్లు ప్రకటించింది.
You may be interested
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లాభం రూ.697 కోట్లు
Tuesday 7th August 2018న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీ సెజ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.697 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.768 కోట్లతో పోల్చితే 9 శాతం క్షీణత నమోదైందని ఏపీ సెజ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,960 కోట్ల నుంచి రూ.2,704 కోట్లకు తగ్గిందని ఏపీసెజ్ సీఈఓ కరణ్ అదానీ తెలిపారు.
హెచ్‌యూఎల్ చేతికి ‘ఆదిత్య మిల్క్’
Tuesday 7th August 2018న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్’ బ్రాండ్‌ను ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్ బ్రాండ్ ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్ యాజమాన్య సంస్థ, విజయకాంత్ డైరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్ తెలిపింది. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిస్సర్ట్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా