STOCKS

News


త్వరలో మళ్లీ సీఎస్‌సీ ఆధార్‌ సేవలు?

Friday 4th January 2019
Markets_main1546576123.png-23404

- ‘నాన్‌-బయోమెట్రిక్‌’కు పరిమితం
- యూఐడీఏఐ కసరత్తు

న్యూఢిల్లీ: ఆధార్‌ నమోదు, సమాచారంలో మార్పులు, చేర్పులు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఫైలింగ్‌లో ప్రజలకు సహకరించడం వంటి సేవలకు త్వరలో మళ్లీ కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌సీ)ను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘నాన్‌-బయోమెట్రిక్‌’ (వేలిముద్ర అవసరం లేని)కు మాత్రమే ఈ సేవలు పరిమితమవుతాయని సమాచారం. ఈ మేరకు అనుమతులు జారీపై యూఐడీఏఐ (యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేపథ్యం ఇదీ...
 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌, అప్‌డేషన్‌ సేవల పునఃప్రారంభానికి తమను అనుమతించాలని  సీఎస్‌ఈలను నిర్వహిస్తున్న గ్రామ స్థాయి సంస్థలు (వీఎల్‌ఈ) ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. తాము ఎంతో వ్యయంతో పరికరాలను కొన్నామని, ఆధార్‌ సంబంధ కార్యకలాపాలకు ఉద్యోగులను కూడా రిక్రూట్‌ చేసుకున్న తరుణంలో యూఐడీఏఐ నిర్ణయం సరికాదని వీఎల్‌ఈలు కేంద్రానికి ఇప్పటికే విన్నవించాయి.  కేంద్రం కూడా  ఈ డిమాండ్‌ పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తోంది.  120 కోట్ల ఆధార్‌ కార్డుదారుల బయోమెట్రిక్‌ డేటా భద్రతకుగాను సీఎస్‌సీ అలాగే ప్రైవేటు ఆపరేటర్లపై యూఐడీఏఐ నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. కొంత తక్కువ ఫీజుతో సీఎస్‌సీలకు తాజా అనుమతుల వల్ల ఆన్‌లైన్‌ వ్యవస్థతో పెద్దగా పరిచయంలేని గ్రామీణ ప్రాంతవాసులకూ ఎంతో ప్రయోజనం కలుగుతుందని యూఐడీఏఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.



You may be interested

అనధికార డిపాజిట్‌ పథకాలపై ఉక్కుపాదం

Friday 4th January 2019

 కఠిన చర్యలకు పార్లమెంటరీ కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: అనధికార డిపాజిట్‌ పథకాలు, ఇందుకు కారకులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. అన్‌రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ నిషేధ బిల్లులోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 సభ్యుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు తమ సిఫారసులను పార్లమెంటుకు సమర్పించింది. అమాయకులైన ఇన్వెస్టర్లు మోసపూరిత డిపాజిట్‌ స్కీమ్‌లతో మోసపోకుండా తగిన చర్యలు ఉండాలన్నది ఈ సిఫారసుల

రూ. 80 వేల కోట్ల రికవరీ..

Friday 4th January 2019

- అదే బాటన మరో రూ.70 వేల కోట్లు - బ్యాంకింగ్‌ రికవరీలో ఎన్‌సీఎల్‌టీ పాత్ర భేష్‌ - ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్‌సీఎల్‌టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా

Most from this category