STOCKS

News


ఆధార్‌తో ‘గుర్తింపు’ను ఆపేయండి

Tuesday 2nd October 2018
news_main1538451475.png-20779

న్యూఢిల్లీ: వినియోగదారుల గుర్తింపునకు  ఆధార్‌ను ఉపయోగించే  ప్లాన్‌ను 15 రోజుల్లోగా ఆపేయాలని    టెలికం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. ఈ మేరకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆధార్‌ వినియోగంపై సుప్రీం కోర్ట్‌ ఇటీవలనే స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఆధార్‌ విషయమై సుప్రీం కోర్ట్‌ ఇటీవల వెలువరించిన తీర్పుకు అనుగుణంగా టెలికం కంపెనీలు చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌తో వినియోగదారుల గుర్తింపు విధానాన్ని నిలిపేయాలని వివరించింది. ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ అనుసంధానతను తొలగించాలని వినియోగదారుల నుంచి ఎప్పుడు విన్నపం వచ్చినా, తక్షణం దానిని నెరవేర్చాలని పేర్కొంది. వినియోగదారుల గుర్తింపునకు టెలికం డిపార్ట్‌మెంట్‌ ఆమోదించిన పత్రాలు ఆధారంగా కొత్త కేవైసీ నిబంధనలను రూపొందించాలని యూఐడీఏఐ సూచించింది.  



You may be interested

రూ. 637 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులు జప్తు

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (పీఎన్‌బీ) మోసం చేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి దేశవిదేశాల్లో ఉన్న రూ. 637 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది. భారత్‌తో పాటు బ్రిటన్‌, అమెరికా తదితర దేశాల్లో స్థిరాస్తులు, జ్యుయలరీ, ఫ్లాట్స్‌, బ్యాంక్ బ్యాలెన్స్‌ల రూపంలో ఈ అసెట్స్ ఉన్నట్లు వివరించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆదిత్య నానావతిపై ఇంటర్‌పోల్

ఆగస్టులో ‘మౌలికం’ వృద్ధి నెమ్మది!

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక విభాగం ఆగస్టు నెలలో మందగించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం 4.2 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్‌, ఎరువులు పేలవ పనితీరు దీనికి కారణం.  2018 జూలైలో ఈ రేటు 7.3 శాతం. 2017 ఆగస్టులో 4.4 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో  ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం.  వీటిలో బొగ్గు , క్రూడ్‌ ఆయిల్‌ ,

Most from this category