STOCKS

News


సబ్సీడీ నగదు బదిలీకి ఆధార్‌ ఈ-కేవైసీ వాడొచ్చు

Monday 29th October 2018
news_main1540789408.png-21549

  • బ్యాంకులకు యూఐడీఏఐ స్పష్టత

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు సంబంధించి నగదు బదిలీ (డీబీటీ) లబ్ధిదారుల ధృవీకరణ కోసం బ్యాంకులు ఆధార్ ఈ-కేవైసీని ఉపయోగించవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ యూఐడీఏఐ స్పష్టతనిచ్చింది. ఒకవేళ ఖాతాదారు స్వచ్ఛందంగా అనుమతి ఇచ్చిన పక్షంలో వారి ధృవీకరణకు ఆఫ్‌లైన్‌లో పేపరు రూపంలోని ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ధృవీకరణ కోసం ఆధార్‌ను ఏయే సందర్భాల్లో, ఏయే రూపాల్లో ఉపయోగించవచ్చో బ్యాంకులకు గత వారంలో చేసిన సూచనల కాపీని తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు కూడా పంపినట్లు యూఐడీఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు, చిరునామా ధృవీకరణ కోసం ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను ఉపయోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యూఐడీఏఐ తాజా వివరణనిచ్చింది.



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌పై ఎస్సార్‌ గ్రూపు న్యాయపోరాటం

Monday 29th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్‌ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్‌ మిట్టల్‌ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్‌ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్‌

రూ.1.80లక్షల కోట్లు దాటనున్న మెండిబకాయిల రీకవరీ

Monday 29th October 2018

ఆర్థిక శాఖ అంచనా న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్‌పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ఖాతాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్‌, భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ వంటి

Most from this category