STOCKS

News


యాక్సిస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌పై ఉదయ్‌ కోటక్‌ కన్ను?!

Tuesday 28th August 2018
news_main1535452381.png-19729

ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ త్వరలో యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ల్లో వాటాలు కొనుగోలు చేయబోతున్నారా? అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. కోటక్‌ మహీంద్రా బ్యాంకులో వాటాను 20 శాతానికి లోపు తగ్గించుకోవాలని ఆర్బీఐ ఇటీవల ఉదయ్‌ కోటక్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫ్రిఫరెన్షియల్‌ షేర్‌ సేల్‌ చేసేందుకు ఆర్‌బీఐ అంగీకరించలేదు. అందువల్ల ఈ మొత్తంతో కొత్తగా ఒక విత్త సంస్థను సొంతం చేసుకోవాలని(అక్విజిషన్‌) ఉదయ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోటక్‌ మహీంద్రా బ్యాంకులో ఉదయ్‌ కోటక్‌కు ప్రస్తుతం 30 శాతం వరకు వాటా ఉంది. ఆయన తన వాటాను 20 శాతం లోపునకు తగ్గించుకుంటే సుమారు దాదాపు 1.2 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. ఇంత మొత్తంతో మరో సంస్థను కొనాలన్న యోచనలో ఉదయ్‌ ఉన్నారని ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. ఉదయ్‌ కన్ను యాక్సిస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌పై ఉందని లఖానీ ఫిన్‌సర్వ్‌ తెలిపింది. ఉదయ్‌ కొంటారన్న వార్తలతో ఇటీవల కాలంలో యాక్సిస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. వీటితో పాటు ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లు సైతం ఉదయ్‌ దృష్టిలో ఉన్నట్లు సమాచారం. అయితే అన్నింటిలో యాక్సిస్‌బ్యాంక్‌ మంచి టార్గెట్‌ అవుతుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యాక్సిస్‌లో వాటాలతో ఉదయ్‌ తనకు నచ్చిన కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో మరింత పట్టు సంపాదించే అవకాశం ఉంటుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. గతంలో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.You may be interested

కొనసాగిన రికార్డుల పరంపర

Tuesday 28th August 2018

11700 పైన ముగిసిన నిఫ్టీ 39000ల చేరువలో సెన్సెక్స్‌ మార్కెట్‌లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్‌ ఆద్యంతం దూకుడును ప్రదర్శించిన సూచీలు చివరకు ఆల్‌టైం రికార్డుల్లో స్థిరపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్‌ షేర్లైన  రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతి, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ, మెటల్‌ షేర్ల అండతో సూచీలు మంగళవారం మరోకొత్త రికార్డు వద్ద ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ

ఈ స్టాక్స్‌లో మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌కు ఛాన్స్‌

Tuesday 28th August 2018

ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడితే వచ్చే రెండేళ్లలో మిడ్‌క్యాప్స్‌ మంచి పనితీరు కనబరుస్తాయని ఆస్క్‌సందీప్‌సబర్వాల్‌.కామ్‌కు చెందిన అడ్వైజర్‌ సందీప్‌ సబర్వాల్‌ తెలిపారు. గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లపై, ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌పై పాజిటివ్‌ ఔట్‌లుక్‌ ఉందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు బలంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, ప్రస్తుత వడ్డీ రేట్లు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని తెలిపారు. చైనా భయాలు, డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం వంటి పలు

Most from this category