STOCKS

News


నియంత్రణలు పెరిగిపోతున్నాయ్‌..

Friday 30th November 2018
news_main1543554737.png-22510

ముంబై: వ్యాపార సంస్థలపై నియంత్రణలు పెరిగిపోతుండటంపై కార్పొరేట్ దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, ఉదయ్‌ కొటక్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రణల వెనుక భావానికన్నా... భాషకే ప్రాధాన్యముంటోందని, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడానికే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. "నిబంధనలో స్పష్టత లేనప్పుడు భావాన్ని అనుసరించి ముందుకెడదామనుకుంటే.. వెంటనే లాగిపెట్టి ఒకటి కొడుతున్నారు. ఈ నిబంధనను తు.చ. తప్పకుండా పాటించావా లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల వెనుక భావాన్ని గ్రహించి తదనుగుణంగా వ్యవహరిస్తే సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోంది" అని కార్పొరేట్ గవర్నెన్స్‌పై జరిగిన ఒక సదస్సులో ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యానించారు. ప్రమోటర్‌ షేర్‌ హోల్డింగ్‌ను తగ్గించుకునే నిబంధన అమలు విషయంలో కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఇటీవలే నియంత్రణ సంస్థ నుంచి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రస్తుత పరిస్థితులు గతకాలపు లైసెన్స్ జమానాను తలపిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. వ్యాపారాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. అటు నియంత్రణ సంస్థలు ఏదైనా నిబంధనను రూపొందించే ముందు.. దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు, నష్టాలను సమగ్రంగా విశ్లేషించుకుని, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ చెప్పారు. అటు ప్రతికూల విధానాల కారణంగానే ఇన్‌ఫ్రా రంగం నుంచి ప్రైవేట్ పెట్టుబడులు తరలిపోతున్నాయని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. విధానాలపరంగా స్థిరత్వం ఉంటేనే ప్రైవేట్ పెట్టుబడులు రాగలవని లేకపోతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఎదురవుతాయన్నారు. విధానాలపరమైన కారణాల వల్ల విద్యుత్‌, ఉక్కు, బొగ్గు వంటి కీలక ఇన్‌ఫ్రా రంగాల్లో పలు ప్రాజెక్టుల్లో జాప్యంతో.. రూ. 12 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో రజనీష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. You may be interested

క్రూడ్‌ ధరల అనూహ్య పతనం

Friday 30th November 2018

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 డాలర్లు కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్స్చేంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర గురువారం ఒక దశలో 49.46 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఇక

2019 చివరికల్లా 14,000 పాయింట్లకు నిఫ్టీ..!

Friday 30th November 2018

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా. ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ప్రకటించనున్న కార్పొరేట్‌ ఫలితాలు దేశీ స్టాక్‌ మార్కెట్లను పరుగులు పెట్టించనున్నాయని సంజీవ్‌ భాసిన్‌ విశ్లేషించారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధి 18 శాతం ఉండనుందని అంచనావేసిన ఈయన.. వచ్చే ఏడాదిలో నిఫ్టీ 10,000 నుంచి 12,000 పాయింట్ల మధ్యకు చేరుకుంటుందన్నారు. దీపావళి సమయానికి 14,000 పాయింట్లను తాకుతుందని ఒక ఆంగ్ల

Most from this category