STOCKS

News


యూకో బ్యాంక్‌కు మొండి సెగ

Tuesday 13th November 2018
news_main1542085303.png-21930

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ఈ క్యూ2లో మరింతగా పెరిగాయి. గత క్యూ2లో రూ.623 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.1,136 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు పెరిగాయని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.3,758 కోట్ల నుంచి రూ.3,749 కోట్లకు తగ్గింది. 
తగ్గిన రుణ నాణ్యత 
బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా క్షీణించింది. గత క్యూ2లో 19.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 25.37 శాతానికి పెరిగాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. నికర మొండి బకాయిలు 9.98 శాతం నుంచి 11.97 శాతానికి ఎగిశాయి. అంకెల్లో చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.24,435 కోట్ల నుంచి రూ.29,581 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.11,008 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగాయి.  మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులను కూడా ఈ బ్యాంక్‌ పెంచింది. గత క్యూ2లో రూ.1,323 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో 1,411 కోట్లకు పెరిగాయని యూకో బ్యాంక్‌ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో బీఎస్‌ఈలో యూకో బ్యాంక్‌ షేర్‌ 4.2 శాతం క్షీణించి రూ.20.20 వద్ద ముగిసింది. 



You may be interested

59 శాతం పెరిగిన గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిటేడెట్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 59 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.190 కోట్లకు పెరిగిందని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.58 కోట్లుగా ఉన్న పన్ను వ్యయాలు ఈ

ట్రాయ్‌ పరిధిలోకి వాట్సాప్‌, గూగుల్‌ డూయో!?  

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: టెలికం సంస్థల మాదిరే మెస్సేజ్‌లు, కాల్స్‌కు అవకాశం కల్పిస్తున్న వాట్సాప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ డుయో తదితర ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) సేవలను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాయ్‌ సంప్రతింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత నియంత్రణ విధానంలో తేవాల్సిన మార్పులపై విశ్లేషణకు, చర్చకు అవకాశం కల్పించడం కోసం ఈ పత్రాన్ని తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌ ఆధారంగా కాల్స్‌, మెస్సేజింగ్‌ సేవల అప్లికేషన్లను ఓటీటీగా

Most from this category