STOCKS

News


విజయవాడలో ఉబర్‌ ఈట్స్‌

Wednesday 11th July 2018
news_main1531327900.png-18219

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ కంపెనీ ఉబర్‌ ఈట్స్‌ విజయవాడలో సేవలను ప్రారంభించింది. ప్యారడైజ్, క్రీమ్‌స్టోన్, డ్రన్‌కీన్‌ మంకీ, సెవెన్‌ డేస్, సదరన్‌ స్పైస్‌ వంటి స్థానిక రెస్టారెంట్లతో ఉబర్‌ ఈట్స్‌ ఒప్పందం చేసుకుంది. ఉబర్‌ రైడ్స్‌ కంటే ముందు ఉబర్‌ ఈట్స్‌ సేవలను ప్రారంభించిన తొలి నగరం విజయవాడేనని ఉబర్‌ ఈట్స్‌ హెడ్‌ భావిక్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఐదు ఆర్డర్లకు 50 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని.. కనీస ఆర్డర్‌ విలువ రూ.100గా నిర్ణయించామని ప్రతి డెలివరీ మీద రూ.10 డెలివరీ చార్జీ ఉంటుందని కంపెనీ తెలిపింది. విశాఖపట్నంలోనూ ఉబర్‌ ఈట్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. 
 



You may be interested

ఐడీబీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

Wednesday 11th July 2018

ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ అయిదు

ఈ కామర్స్‌ నియంత్రణకు నిబంధనలు

Wednesday 11th July 2018

జెనీవా: భారత​ఈ కామర్స్‌ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఈ కామర్స్‌ రంగం 2020 నాటికి 120 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్‌ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్‌ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో

Most from this category