STOCKS

News


అటు ఇటుగా బైక్‌ల విక్రయాలు

Thursday 3rd January 2019
news_main1546492658.png-23379

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్‌ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్‌ పవన్‌ ముంజాల్‌.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో 30 శాతం పెరిగాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్‌ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్‌ మోటార్‌ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్‌ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి.
జీఎస్‌టీని తగ్గించాలి..
ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28 శాతం జీఎస్‌టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయని పవన్‌ ముంజాల్‌ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్‌లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించాలని కోరారు.
ఫోర్డ్‌ అమ్మకాలు 14.8% అప్‌
2018 డిసెంబర్‌ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్‌ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది.
సోనాలికా ట్రాక్టర్‌ విక్రయాలు 12% పెరిగాయి
గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 11.9 శాతం పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14 శాతం వృద్ధి చెందాయి. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం చేపట్టిన రైతు అనుకూల విధానాలు, నిర్మాణాత్మక సంస్కరణలు.. రబీ పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల అమ్మకాలు పెరిగాయి.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

నిర్మాణంలోని ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీ తగ్గింపు?

Thursday 3rd January 2019

- 5 శాతానికి పరిమితం చేసే అవకాశం - ఈ నెల 10న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం? రూ.75 లక్షలలోపు టర్నోవరుండే వ్యాపారులకు మినహాయింపు కూడా!! న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల 10న జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయంగా తెలిసింది. డిసెంబర్‌ 22న జరిగిన చివరి సమావేశంలో కౌన్సిల్‌ 23 రకాల

మరో మెగా బ్యాంక్‌ రెడీ..!

Thursday 3rd January 2019

బీవోబీలో విజయా, దేనా విలీనానికి క్యాబినెట్ ఆమోదం - మూడో అతి పెద్ద బ్యాంక్‌ ఏర్పాటు - ఏప్రిల్‌ 1 నుంచి కార్యకలాపాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్రం క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్‌ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని

Most from this category