STOCKS

News


టీవీఎస్‌ మోటార్‌ డైరెక్టర్‌, సీఈవోగా రాధాకృష్ణన్‌

Thursday 25th October 2018
news_main1540445172.png-21461

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ కేఎన్‌ రాధాకృష్ణన్‌ను హోల్‌టైమ్‌ డైరెక్టర్‌, సీఈవోగా నియమించింది. ఈ నెల 23 నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవుల్లో కొనసాగుతారు. రాధాకృష్ణన్‌ 1986లో టీవీఎస్‌ గ్రూపు కంపెనీ సుందరం క్లేటాన్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా చేరి బిజినెస్‌ ప్లానింగ్‌ హెడ్‌గా ఎదిగారు. 2004లో టీవీఎస్‌ మోటార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 2008లో ప్రెసిడెంట్‌ అయ్యారు. రాధాకృష్ణన్‌ మార్గదర్శకంలోనే కంపెనీ దేశంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించింది. టీవీఎస్‌ మోటార్‌ను అంతర్జాతీయంగా 60 మార్కెట్లకు విస్తరింపజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు కంపెనీని తీసుకెళ్లగలరని టీవీఎస్‌ మోటార్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. 
 



You may be interested

హోటల్‌ గదుల బుకింగ్‌పై ఓయో ఆఫర్లు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: హోటల్‌ గదుల బుకింగ్‌, తదితర సేవల్లో ఉన్న ఓయో... ఈ ఏడాది శీతాకాలం బుకింగ్‌ల్లో రికార్డు స్థాయిలో 73 శాతం వృద్ధి నెలకొన్నట్టు ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా పర్యాటకులకు అందుబాటు ధరలకే బుకింగ్‌లకు వీలు కల్పించేందుకు ఫ్లాట్‌గా 60 శాతం తక్కువకు ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. పేటీఎం ద్వారా లావాదేవీ నిర్వహించిన వారికి మరో 40 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నట్టు తెలిపింది.

రెండు రెట్లు పెరిగిన మహీంద్రా  ఫైనాన్షియల్స్‌ లాభం

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.164 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.381 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం, ఇతర ఆదాయం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసిందని పేర్కొంది. గత క్యూ2లో

Most from this category