STOCKS

News


టీవీఎస్‌ మోటార్‌ లాభం రూ.146 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533637681.png-19019

దేశీ నాలుగో అతిపెద్ద టూవీలర్‌ కంపెనీ టీవీఎస్‌ మోటార్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.146.6 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభం రూ.129.5 కోట్లుగా ఉంది. ఈ క్యూ1లో కంపెనీ టూవీలర్‌ విక్రయాలు 14 శాతం వృద్ధితో 8,92,754 యూనిట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో విక్రయాలు 7,85,071 యూనిట్లుగా ఉన్నాయి. త్రీవీలర్‌ అమ్మకాలు వార్షికంగా చూస్తే 172 శాతం వృద్ధితో 13,037 యూనిట్ల నుంచి 35,520 యూనిట్లకు ఎగశాయి. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.4,153 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.3,399 కోట్లుగా ఉంది. ఈబీటా 45 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు, మార్జిన్లు 7.4 శాతానికి పెరిగాయి. 

కాగా ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌ షేరు ధర 4 శాతం పెరుగుదలతో రూ.549 వద్ద ముగిసింది. 



You may be interested

నెలరోజుల్లో ఎన్నికల కాక తగులుతుంది!

Tuesday 7th August 2018

మార్కెట్లపై సమీర్‌ అరోరా అంచనా ప్రస్తుతం దేశీయ సూచీల్లో రిలీఫ్‌ర్యాలీ నడుస్తోందని, కొంత కాలం పోతే కానీ సూచీలకు ఎన్నికల కాక తగిలి పతనాభిముఖంగా పయనిస్తాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌, మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశీయ ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు అటుఇటుగా తిరుగుతునానయి. ఎర్నింగ్స్‌పై ఆశలతో సూచీలు పాజిటివ్‌గా రియాక్టవుతున్నాయని సమీర్‌ చెప్పారు. క్రమంగా మరో నెల రోజుల్లో సూచీల చూపు ఎన్నికలపై పడుతుందన్నారు. ఎన్నికలంటేనే

మూడు స్టాక్స్‌ నిఫ్టీని నిలబెట్టాయి...

Tuesday 7th August 2018

ప్రస్తుత ఏడాది ప్రథమార్ధంలోని మార్కెట్‌ పతనాలు నిజం కాదనే విషయాన్ని ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ నిరూపించాయని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోకప్రియ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిఫ్టీని గమనిస్తే.. ఇందులోని పెరుగుదలకు ప్రధానంగా మూడు స్టాక్సే కారణమని పేర్కొన్నారు. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇందులో ఉన్నాయన్నారు. నిఫ్టీలోని చాలా కంపెనీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయని

Most from this category