STOCKS

News


టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ మొత్తం ఆదాయం రూ.1,202 కోట్లు

Tuesday 16th October 2018
news_main1539665547.png-21186

 న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.40 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.7.3 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 తెలిపింది. గత క్యూ2లో రూ.235 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,202 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వయాకామ్‌ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఈ ఏడాది మార్చి నుంచి తమ అనుబంధ సంస్థలుగా మారాయని, అందుకని గత క్యూ2 ఫలితాలను, ఈ క్యూ2 ఫలితాలతో పోల్చడానికి లేదని వివరించింది. ఈ క్యూ2లో మొత్తం  రూ.1,146 కోట్ల వ్యయాలయ్యాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీ షేర్‌ 13 శాతం లాభంతో రూ.39.75 వద్ద ముగిసింది. 



You may be interested

16 రెట్లు పెరిగిన సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

Tuesday 16th October 2018

ముంబై: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.4.3 కోట్ల నికర లాభం వచ్చిందని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ క్యూ2లో నికర లాభం 16 రెట్లు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,855 కోట్లకు పెరిగిందని తెలిపింది. స్థూల

ప్రపంచ ఎకానమీకి చమురు సెగ..

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: అంతకంతకూ పెరిగిపోతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల గరిష్టానికి చేరిన రేట్లను కట్టడి చేయకపోతే వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని చమురు ఉత్పత్తి దేశాలను హెచ్చరించారు.  చమురు రేట్లను సముచిత స్థాయులకు తెచ్చేందుకు ఉత్పత్తి దేశాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. ఇండియా ఎనర్జీ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా

Most from this category