STOCKS

News


మరో 20 నగరాలకు ట్రూజెట్‌ సేవలు!

Thursday 12th July 2018
news_main1531404172.png-18251

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్‌’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్‌ పథకంలో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి కాండ్లా, పోర్‌బందర్‌, కేశోడ్‌, జైసల్మేర్‌, జల్గావ్‌, నాసిక్‌ నగరాలకు ట్రూజెట్‌ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజధాని గువహటి నుంచి బర్న్‌పూర్‌, కూచ్‌ బిహార్‌, తేజు, రూప్సి పట్టణాలను కూడా అనుసంధానించనుంది. ఈ సేవల ద్వారా తూర్పు, పశ్చిమ భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాదిన హైదరాబాద్‌, విజయవాడ, కడపతో పాటు 14 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఇందులో ఉడాన్‌ కింద కడప, నాందేడ్‌, బళ్లారి, మైసూర్‌, సేలం ఉన్నాయి. ఉడాన్‌ కింద దక్కించుకున్న అన్ని రూట్లలో సర్వీసులను విజయవంతంగా నడుపుతున్న తొలి సంస్థ ట్రూజెట్‌ కావడం గమనార్హం.
మరో 7 విమానాలు..
ట్రూజెట్‌ 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తమ విమానాల్లో 12 లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించారని, తమ వద్ద ఏటీఆర్‌-72 రకం విమానాలు 5 ఉన్నాయని, మార్చినాటికి కొత్తగా మరో 5 నుంచి 7 విమానాలను లీజు ప్రాతిపదికన  సమకూర్చుకుంటామని ట్రూజెట్‌ సీఈవో విశోక్‌ మాన్‌సింగ్‌ తెలిపారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను లక్ష్యంగా చేసుకుని విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం రోజుకు 32 సర్వీసులు నడుపుతున్నాం. ఆగస్టు నుంచి ఈ సంఖ్య 44 లేదా 48కి చేరుతుంది. 85 శాతం ఆక్యుపెన్సీ ఉంది’’ అని వివరించారు.
అంతటా పైలట్ల కొరత..
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు పైలట్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు మాన్‌సింగ్‌ తెలియజేశారు. ఇందుకు ట్రూజెట్‌ మినహాయింపు కాదన్నారు. ‘‘ఒక్కో విమానానికి ఆరుగురు పైలట్లు అవసరమవుతారు. కాకపోతే పైలట్లు అనుభవం సంపాదించిన కొద్దీ పెద్ద విమానాలు నడపటానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొరత తప్పటం లేదు’’ అన్నారాయన. దేశీయంగా ఏ రూట్లో అయినా 6 నుంచి 9 నెలల్లో ఆపరేషనల్‌ బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోవచ్చని సంస్థ సీఎఫ్‌వో విశ్వనాథ్‌ ఈ సందర్భంగా చెప్పారు.

(మీడియా సమావేశంలో విశోక్‌ మాన్‌సింగ్‌, సీసీవో సుధీర్‌ రాఘవన్‌, విశ్వనాథ్‌, డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, ఎంఈఐఎల్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ (ఎడమ నుంచి కుడికి)You may be interested

ఎయిర్‌టెల్ పేమెంట్స్‌ బ్యాంకుకు ఊరట

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్‌ నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలియజేసింది. అలాగే ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్‌ ఈ-కేవైసీని ఉపయోగించుకునేందుకు విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. ఎయిర్‌టెల్ మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్ సబ్సిడీ

అశోక్‌ లేలాండ్, హెచ్‌పీసీఎల్‌ కో-బ్రాండెడ్‌ కార్డు

Thursday 12th July 2018

చెన్నై: హిందూజా గ్రూప్‌నకు చెందిన అశోక్‌ లేలాండ్‌... తాజాగా హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) భాగస్వామ్యంతో ‘ఇన్‌-ధన్‌ ఫ్యూయెల్‌ కార్డు’ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ద్వారా వాణిజ్య వాహన యజమానులు కస్టమైజ్‌డ్‌ సేవలు పొందొచ్చు. ఈ కార్డు ఆవిష్కరణ సందర్భంగా అశోక్‌ లేలాండ్‌ ఎండీ కె దాసరి మాట్లాడుతూ.. ‘వాహనాల నిర్వహణలో ఇంధనం ఖర్చే 70 శాతం వరకు ఉంటుంది. కస్టమర్లకు మా కో-బ్రాండెడ్‌ కార్డు కస్టమైజ్డ్‌ సర్వీసులందిస్తుంది. దీని

Most from this category