STOCKS

News


రూ.799కే ట్రూజెట్‌ విమానయానం

Friday 8th March 2019
Markets_main1552023352.png-24483

- నేటి నుంచి సేల్‌ ప్రారంభం
- ఈ నెల 17 వరకు లక్ష సీట్ల విక్రయం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ట్రూజెట్‌ పేరుతో విమానయాన రంగంలో ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ గ్రేట్‌ టేకాఫ్‌ సేల్‌ను ప్రకటించింది. అన్ని రూట్లలో బేస్‌ ఫేర్‌ రూ.799గా ఉంటుంది. పన్నులు దీనికి అదనం. మార్చి 8 నుంచి మార్చి 17 మధ్యలో బుక్‌ చేసి... మార్చి 8 నుంచి అక్టోబరు 26 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. గ్రేట్‌ టేకాఫ్‌ సేల్‌లో సుమారు లక్ష సీట్లను ఆఫర్‌ చేస్తున్నట్టు ట్రూజెట్‌ సీసీవో సుధీర్‌ రాఘవన్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ఉడాన్‌ ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని ట్రూజెట్‌ ‘స్కై ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం కింద మెట్రో నగరాలను చిన్న పట్టణాలతో అనుసంధానిస్తోంది. కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా వెబ్‌సైట్‌ను మెరుగుపర్చడమేగాక ఎయిర్‌లైన్‌ ఇమేజ్‌ను రీబ్రాండ్‌ చేపట్టింది. సిబ్బంది కొత్త యూనిఫాంలో దర్శనమీయనున్నారని ట్రూజెట్‌ సీఈవో ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.



You may be interested

రూ. 20 కడితే ఆధార్ సర్వీసులు

Friday 8th March 2019

ఈ-కేవైసీ కోసం వ్యాపార సంస్థలకు యూఐడీఏఐ నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: కస్టమర్ ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. "ఆధార్ ధృవీకరణ సర్వీసులకోసం

జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!

Friday 8th March 2019

- భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా - రూ.31,600 కోట్ల విద్యుత్‌ పెట్టుబడులకు ఆమోదం - ఎన్‌హెచ్‌పీసీ చేతికి ల్యాంకో తీస్తా ప్రాజెక్టు - ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన

Most from this category