News


ఫేమ్‌-2కు సిద్ధమైన ట్రినిటీ క్లీన్‌టెక్‌

Saturday 2nd March 2019
news_main1551506314.png-24403

2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి
సామర్థ్యం పెంపునకు వినియోగం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:-
దేశంలో ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాల వినియోగాన్ని అధికం చేసేందుకు రెండో విడత ఫేమ్ పథకానికి కేంద్రం రూ.10,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో అయిదు లక్షల త్రిచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార అవకాశాలను అందుకోవడానికి హైదరాబాద్‌ కంపెనీ ట్రినిటీ క్లీన్‌టెక్‌ సిద్ధమైంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, వాహనాల తయారీకై 2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ఎండీ పి.కె.శ్రీవాస్తవ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ట్రినిటీ క్లీన్‌టెక్‌ ఈటో బ్రాండ్‌ కింద ఈ-ఆటోలను హైదరాబాద్‌ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తోంది. 

 

భారీ లక్ష్యంతో ముందుకు..
కంపెనీ అయిదు రకాల మోడళ్లలో ప్రీమియం ఈ-ఆటోలను తయారు చేస్తోంది. ఎక్కువ రోజులు మన్నే, తక్కువ సమయంలో చార్జింగ్‌ పూర్తి అయ్యే లిథియం అయాన్‌ బ్యాటరీలను వాడుతోంది. ఎయిర్‌ కండీషన్డ్‌ మోడల్‌ సైతం కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. 2019-20లో మొత్తం 1,000 ఈ-ఆటోలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు శ్రీవాస్తవ వెల్లడించారు. 2020-21లో 5,000లకుపైగా యూనిట్లకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఫేమ్‌-2 పథకం కింద వాహన కొనుగోలుదార్లకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వనుండడంతో ఈ స్థాయి అమ్మకాలు ఉంటాయని వివరించారు. జడ్చర్ల ప్లాంటులో ప్రస్తుతం 30 మంది ఉద్యోగులున్నారు. కొద్ది రోజుల్లో ఈ సంఖ్య 100కు చేరనుందని ఆయన చెప్పారు.

 

తొలుత బీ టూ బీ..
బిజినెస్‌ టు బిజినెస్‌కు ట్రినిటీ క్లీన్‌టెక్‌ తొలుత ప్రాధాన్యమిస్తోంది. సెనెగల్‌ ప్రభుత్వానికి ఇటీవలే 200 ఈ-ఆటోలను ఎగుమతి చేసింది. నోయిడా మెట్రోకు తొలుత 50 ఆటోలను అందించనున్నారు. తరువాత దశలో 200 ఆటోలు సరఫరా చేస్తారు. ఈటోల సరఫరాకై ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్లతోనూ కంపెనీ చర్చిస్తోంది. కొద్దిరోజుల్లో ఈ చర్చలు కార్యరూపంలోకి రానున్నాయని ట్రినిటీ క్లీన్‌టెక్‌ ధీమాగా ఉది. ఇక హైదరాబాద్‌ మెట్రోకు 100 ఆటోల సరఫరాకై ఇప్పటికే ఒప్పందం కుదిరింది. త్వరలో భాగ్యనగరి మెట్రో స్టేషన్ల నుంచి ‘ఈటో’ బ్రాండ్‌ ఆటోలు పరుగు తీయనున్నాయి. బ్యాటరీని మార్చుకునేలా స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణిస్తుంది.You may be interested

జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయ్‌

Saturday 2nd March 2019

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.లక్ష కోట్ల మార్కు దిగువకు పరిమితమయ్యాయి. గతనెల మొత్తం వసూళ్లు రూ.97,247 కోట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. జనవరిలో లక్ష కోట్ల మార్కును దాటిన వసూళ్లు.. ఆ తరువాత నెలలో ఈ మార్కును చేరుకోలేకపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. జనవరి నుంచి 23 రకాల వస్తుసేవలపై పన్నురేటు తగ్గడమేనని తెలుస్తోంది.

నిద్రపుచ్చే కంపెనీ!

Saturday 2nd March 2019

వేక్‌ఫిట్‌లో ఆర్థోపెడిక్‌ స్లీపింగ్‌ ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి టావెల్‌ పిల్లోస్, దుప్పట్లు, కుషన్స్‌ నెలకు రూ.9 కోట్ల వ్యాపారం; హైదరాబాద్‌ వాటా కోటి సికోయా క్యాపిటల్‌ నుంచి రూ.65 కోట్లు నిధుల సమీకరణ  ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నిద్ర పోవాలంటే.. ముందు మేల్కోవాలి’ ఇది ఓ పరుపుల తయారీ కంపెనీ ప్రకటన. మేల్కోవాల్సిన అవసరం లేదు.. నిద్రపుచ్చితే చాలు అంటోంది మ్యాట్రెస్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ వేక్‌ఫిట్‌. వేక్‌ఫిట్‌ పరుపు మీద

Most from this category