STOCKS

News


ఫార్మా ఎగుమతులు అప్‌

Friday 10th August 2018
news_main1533897232.png-19137

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు మళ్లీ గాడినపడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతైన ఫార్మా ఎగుమతులు 3 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. గతేడాదిలో 17.3 బిలియన్‌ డాలర్లు (రూ.1,18,784 కోట్లు) విలువైన ఔషధ ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారంలో వెల్లడయింది. 2016-17 కాలంలో 16.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగగా, అంతకుముందు ఏడాదిలో 16.9 బిలియన్‌ డాలర్ల మేర ఎక్స్‌పోర్ట్స్‌ జరిగినట్లు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన నియంత్రణ పరమైన అంశాలు, ధరల ఒత్తిడి కారణంగా గతకొంతకాలంగా నెమ్మదించిన ఫార్మా ఎగుమతులు.. గతేడాదిలో పర్వాలేదని అనిపించినప్పటికీ, 3 శాతం వృద్ధి అనేది తక్కువేనని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. యూఎస్‌ ఎఫ్‌డీఏ ఇంపోర్ట్‌ అలర్డ్స్‌, కరెన్సీ విలువలో ఒడిదుడుకులు కూడా ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. దక్షిణ ఆఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీ దేశాలకు దేశీ ఫార్మా ఎగుమతులు కొనసాగుతుండగా.. అత్యధికంగా అమెరికాకు 25 శాతం వరకు ఎక్స్‌పోర్ట్స్‌ జరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో చైనా, జపాన్‌ దేశాల ఎగుమతులపై ప్రభుత్వం దృష్టిసారించినప్పటికీ.. నియంత్రణ పరమైన ఒత్తిళ్లు ఎదురవుతూనే ఉన్నాయనేది ఈ రంగ నిపుణులు మాట. ఎగుమతి అవుతున్న ఉత్పత్తి, సేవల జాబితాలో ఫార్మా రంగం టాప్‌ 5లో ఉంది. గతేడాదిలో మొత్తం దేశీ ఎక్స్‌పోర్ట్స్‌ విలువ 303 బిలియన్‌ డాలర్లు (రూ.20,80,170 కోట్లు) కాగా, ఇందులో ఫార్మా వాటా 6 శాతంగా నిలిచింది. ఫార్మా రంగంలో జనరిక్‌ ఔషధాలు ఆదాయం పరంగా 75 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నాయి. అంతర్జాతీయ జనరిక్‌ ఔషధాల మార్కెట్‌లో భారత్‌ 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అయితే, ఇందులో 55 శాతం నియంత్రణ కలిగిన మార్కెట్‌లలో కొనసాగుతోంది. 



You may be interested

పేటీఎం చేతికి 'బ్యాలెన్స్ టెక్నాలజీ'

Friday 10th August 2018

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తాజాగా బెంగళూరుకు చెందిన సేవింగ్స్ మేనేజ్‌మెంట్ స్టార్టప్ సంస్థ బ్యాలెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేసింది. దీనికోసం ఎంత వెచ్చించిందీ పేటీఎం వెల్లడించనప్పటికీ.. డీల్ విలువ సుమారు 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. తమ యూజర్లు, వ్యాపార సంస్థల మధ్య ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపర్చేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని పేటీఎ౾ం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్ సీఎఫ్‌వో మధుర్ దేవరా తెలిపారు.

వర్ల్‌పూల్‌ ఇండియా లాభం 23 శాతం అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: గృహోపకరణాలు తయారు చేసే వర్ల్‌పూల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.164 కోట్లకు పెరిగిందని వర్ల్‌పూల్‌ ఇండియా తెలిపింది. గత ఏడాది జీఎస్‌టీ అమలుపై అనిశ్చితి కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో అమ్మకాలు అంతంత

Most from this category