STOCKS

News


టయోటా- ప్యానాసోనిక్‌ జట్టు

Wednesday 23rd January 2019
news_main1548220299.png-23743

- ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ తయారీకి జేవీ
- 2020 కల్లా ఏర్పాటు!

టోక్యో: ఎలక్ట్రిక్‌ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్‌ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది.
బ్యాటరీలు కీలకం
టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 15 శాతం వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50 శాతానికి పెంచుకోవాలనుకుంటున్నట్లు  టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందని పేర్కొ‍న్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్‌ కంపెనీకి ప్రత్యేక సామర్థా‍్యలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న  భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్‌ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.



You may be interested

కొత్త బాలెనో’ బుకింగ్స్‌ షురూ..

Wednesday 23rd January 2019

ప్రారంభ చెల్లింపు రూ.11,000  న్యూఢిల్లీ: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు కొత్త వెర్షన్‌ ముందస్తు బుకింగ్స్‌ను.. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రారంభించింది. రూ.11,000 ఇనీషియ‌ల్ పేమెంట్‌ కింద చెల్లించి నూతన కారును బుక్‌ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల్లో ఈ నూతన వెర్షన్‌ మార్కెట్లోకి విడుదల కానుండగా.. ఫిబ్రవరి తొలినాళ్లలోనే లాంచింగ్‌ కార్యక్రమం ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కారు ముందు వైపు డిజైన్‌

మార్కెట్లోకి నిస్సాన్‌ ‘కిక్స్’

Wednesday 23rd January 2019

ధరల శ్రేణి రూ.9.55 – 14.65 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ నిస్సాన్‌.. ‘కిక్స్’ పేరుతో భారత మార్కెట్లో నూతన ఎస్‌యూవీ మోడల్‌ కారును విడుదల చేసింది. ప్రత్యేకించి ఇక్కడి మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 14.23 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్‌ వేరియంట్‌ 20.45 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.9.55 లక్షలు

Most from this category