News


‍అదానీ గ్రూప్‌తో టోటల్ జట్టు

Thursday 18th October 2018
news_main1539834327.png-21259

 న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్‌ఏ చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద దేశవ్యాప్తంగా ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ ఏర్పాటు, ద్రవీకృత సహజ వాయువు దిగుమతి టెర్మినల్‌ అభివృద్ధి చేయనుంది. ఒడిషాలోని ధమ్రాలో ఏటా 5 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉండే టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు జారీ చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అలాగే, వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,500 ఇంధన రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఇవి ప్రధానంగా జాతీయ రహదారులపై ఉండనున్నాయి. అదానీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుల్లో కూడా వాటాలు తీసుకోవాలని టోటల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంలో టోటల్‌.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద  ఎల్‌ఎన్‌జీ సంస్థ. అటు 11 బిలియన్ డాలర్ల అదానీ గ్రూప్‌.. ఇంధనం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పోర్టులు, వంట నూనెలు తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. గుజరాత్‌లోని ముంద్రాలో ఇటీవలే పూర్తయిన ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్‌లో అదానీకి 25 శాతం వాటాలు ఉన్నాయి. అటు 2021 నాటికల్లా ఒడిషాలోని ధమ్రాలో కూడా ఇలాంటి టెర్మినల్‌నే నిర్మిస్తోంది. ఈ రెండు టెర్మినల్స్‌లోనూ అదానీకి ఉన్న వాటాల్లో కొంత భాగాన్ని టోటల్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 



You may be interested

మార్కెట్లోకి పోర్షే ‘కయన్‌’ నూతన ఎడిషన్‌

Thursday 18th October 2018

ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. భారత మార్కెట్‌లో ‘కయన్‌’ నూతన ఎడిషన్‌ను బుధవారం విడుదలచేసింది. మూడు వేరియంట్లలో విడుదలైన ఈ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ.1.19 కోట్లు–రూ.1.90 కోట్లు మధ్య ఉన్నట్లు ప్రకటించింది. ప్రారంభ మోడల్‌ ధర రూ.1.19 కోట్లు, ఈ-హైబ్రిడ్‌ ధర రూ.1.58 కోట్లు, టర్బో ధర రూ.1.90 కోట్లుగా వెల్లడించింది. వీ6, వీ8 పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో కారు విడుదలైంది. ఈ

భారత్‌ హోటల్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ హోటల్స్‌, సూక్ష్మ రుణ సంస్థ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వీటితో ఈ ఏడాది ఐపీఓకు అనుమతులు పొందిన కంపెనీల సంఖ్య 60కు చేరింది.  భారత్‌ హోటల్స్‌ ఐపీఓ @ 1,200 కోట్లు  భారత్‌ హోటల్స్‌ కంపెనీ ద లలిత్‌ బ్రాండ్‌ కింద ఐదు నక్షత్రాల హోటళ్లు, ప్యాలస్‌లు, రిసార్ట్స్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ద లలిత్‌ ట్రావెలర్‌

Most from this category