STOCKS

News


టైటాన్‌ నికర లాభం రూ.301 కోట్లు

Saturday 10th November 2018
news_main1541827571.png-21839

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌​ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.301 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ2లో రూ.278 కోట్ల నికర లాభం వచ్చిందని, ఈ క్యూ2లో 8 శాతం వృద్ధి సాధించామని టైటాన్‌ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,603 కోట్ల నుంచి రూ.4,595 కోట్లకు పెరగిందని టైటాన్‌ సీఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ చెప్పారు. జ్యుయలరీ విభాగం ఆదాయం 29 శాతం పెరగి రూ.3,582 కోట్లకు, వాచ్‌ల విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ.676 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.120 కోట్లకు పెరిగాయని  పేర్కొన్నారు. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు పుంజుకున్నాయని భాస్కర్‌ భట్‌ వివరించారు.  వాచ్‌ల అమ్మకాల విషయంలో  అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్‌ నిలిచిందని తెలిపారు. బ్రాండ్‌ బిల్డింగ్‌ నిమిత్తం తాము చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలనిచ్చాయని, కళ్లజోళ్ల సెగ్మెంట్‌ అమ్మకాలు పెరగడమే దీనికి నిదర్శనమని వివరించారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్‌ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఎబిట్‌ పరంగా చూస్తే, జ్యుయలరీ వ్యాపారం 6.6 శాతం వృద్ధితో రూ.392 కోట్లకు, వాచ్‌ల విభాగం 33 శాతం వృద్ధితో రూ.122 కోట్లకు పెరిగాయని తెలిపింది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో రూ.145 కోట్లు...
ట్రెజరీ కార్యకలాపాల్లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థలో రూ.145 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని భాస్కర్‌ భట్‌ తెలిపారు.. వీటి కోసం రూ.29 కోట్ల కేటాయింపులు జరిపామని, జుయలరీ సెగ్మెంట్లో ఫ్రాంఛైజీ పరిహారం కోసం ఒక్కసారి చెల్లింపులు జరిపామని, ఫలితంగా స్థూల లాభంలో ఎలాంటి పెరుగుదల లేదని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టైటాన్‌ షేర్‌ 0.3 శాతం నష్టపోయి రూ.848 వద్ద ముగిసింది. 


 



You may be interested

విద్యుత్‌ రంగంలోకి నెట్‌లింక్స్‌

Saturday 10th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంటర్నెట్‌ సర్వీసుల కంపెనీ నెట్‌లింక్స్‌ తాజాగా విద్యుత్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర గ్రీన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌లో (ఎస్‌వీ గ్రీన్‌) 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని ఫార్మా సిటీ వద్ద వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 12 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును ఎస్‌వీ గ్రీన్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు వ్యయం రూ.258 కోట్లు. ఇందులో ఈక్విటీ వాటా రూ.78

10,620 పైన ముగిసే వరకు లాంగ్స్‌ వద్దు..!

Saturday 10th November 2018

ముంబై: శుక్రవారం ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమైన ఈ ప్రధాన సూచీ.. ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. న్యారోరేంజ్‌లో కొనసాగి ముగింపు సమయానికి 10,600 స్థాయిని అధిగమించలేకపోయింది. అయితే, ఈ సూచీ డైలీ చార్టులో హామర్‌ క్యాండిల్‌ను ఏర్పాటుచేయడం ద్వారా

Most from this category