News


వాహన విక్రయాలు తగ్గాయి!

Wednesday 2nd January 2019
news_main1546411428.png-23366

 డిసెంబరు అమ్మకాల్లో నెమ్మదించిన వృద్ధి
- ఆకట్టుకోలేకపోయిన భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
- లిక్విడిటీ కొరత వంటి అంశాలే ప్రధాన కారణం!

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చిందని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ సేల్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌, ఎస్‌వీపీ రాజేష్‌ గోయల్‌ చెప్పారు. డిసెంబర్లో హ్యుందాయ్ మోటార్స్‌, టాటా మోటార్స్‌ అమ్మకాలు కేవలం ఒక శాతం వృద్ది రేటుకే పరిమితం కాగా.. మహీంద్రా అండ్‌ మహీంద్ర, మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు ఏకంగా తగ్గుదలను నమోదుచేశాయి.

ఎం అండ్‌ ఎం: పీవీ సేల్స్‌ 4% డౌన్‌
డిసెంబర్‌లో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 15,091 యూనిట్లుగా నమోదైనట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. 2017లో ఇదే కాలానికి విక్రయించిన 15,543 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహన అమ్మకాల్లో సైతం 4 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ సారి 16,906 యూనిట్లకే పరిమితవగా.. 2017 డిసెంబర్‌లో 17,542 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘‘2017 డిసెంబర్లో మా మొత్తం వాహన అమ్మకాలు 36,690 యూనిట్లు. ఈ సారి ఒక శాతం తగ్గాయి’’ అని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.  ప్రత్యేకించి ట్రాక్టర్ల విక్రయాలు 6 శాతం తగ్గి 17,404 యూనిట్లకు పరిమితమయ్యాయి.

టాటా మోటార్స్‌: 1 శాతం పెరిగిన పీవీ విక్రయాలు
డిసెంబర్‌ దేశీ విక్రయాల్లో 8 శాతం క్షీణత చోటుచేసుకున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. 2018 డిసెంబర్‌లో 50,440 యూనిట్లు విక్రయించగా.. 2017 డిసెంబర్లో 54,627 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఇక ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డిసెంబర్‌లో 14,260 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 14,180 యూనిట్లతో పోలిస్తే ఒక శాతం వృద్ధి చోటుచేసుకుంది. వాణిజ్య వాహన అమ్మకాలు 11 శాతం తగ్గి 36,180 యూనిట్లుగా నిలిచాయి. ఈ అంశంపై మాట్లాడిన టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌.. పరిశ్రమ నెమ్మదించినప్పటికీ తమ అమ్మకాలు బాగానే ఉన్నాయన్నారు.

మారుతీ సుజుకీ: 1.3 శాతం తగ్గిన పీవీ సేల్స్‌
గతనెల ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 1,28,338 యూనిట్లుగా నమోదయ్యాయని, ఏడాది ప్రాతిపదికన చూస్తే 1.3 శాతం తగ్గుదల నమోదయిందని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. దేశీ అమ్మకాలు మాత్రం 1,21,479 యూనిట్లకు చేరుకుని 1.8 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది. మిని కార్‌ విభాగంలో ఆల్టో 27,661 యూనిట్లు, వ్యాగన్ఆర్ 27,661 యూనిట్లు అమ్ముడవగా.. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్, డిజైర్ అమ్మకాలు 3.8 శాతం తగ్గినట్లు తెలిపింది.

హ్యుందాయ్: 4.6 శాతం వృద్ధి
2018 డిసెంబర్‌లో 42,093 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40,158 యూనిట్లతో పోలిస్తే 4.6 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రకటించింది. పూర్తి ఏడాది అమ్మకాలు 7,10,012 యూనిట్లు.
హోండా: 4 శాతం పెరుగుదల
గతేడాది డిసెంబర్‌లో 13,139 యూనిట్లను విక్రయించినట్లు హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 12,642 యూనిట్లతో పోలిస్తే 4 శాతం పెరుగుదల నమోదైంది.

వీఈ వాణిజ్య వాహన అమ్మకాలు 2.4% వృద్ధి
వోల్వో గ్రూప్‌, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ అయిన వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (వీఈసీవీ) అమ్మకాలు గతేడాది డిసెంబర్‌లో 6,236 యూనిట్లకు చేరుకుని 2.4 శాతం వృద్ధి చెందాయి. ఏడాది ప్రాతిపదికన ఐషర్ బ్రాండ్‌ ట్రక్కులు, బస్‌ల విక్రయాలు 6,113 యూనిట్లుగా నమోదయ్యాయి.

వచ్చే 6 నెలల్లో 6 అవాన్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: స్టార్ట్‌ అప్‌ ఎలక్ట్రానిక్‌ స్కూటర్‌ తయారీ సంస్థ అవాన్ మోటార్స్ నెలకి ఒక నూతన ఉత్పత్తి చొప్పున వచ్చే ఆరు నెలల్లో మరో ఆరు ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటి ధరల శ్రేణి రూ.45,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుందని సంస్థ సీఓఓ హరీద్ ఠాకూర్ వెల్లడించారు. ఈ ఏడాదిలో అమ్మకాల లక్ష్యం 25,000 యూనిట్లు కాగా, వచ్చే 2-3 ఏళ్లలో లక్ష మార్కును చేరుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవలే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఆరు ఎలక్ట్రానిక్‌ స్కూటర్లను కంపెనీ విడుదలచేసిన సంగతి తెలిసిందే.



You may be interested

ఓఎంసీలకు కష్టకాలం?!

Wednesday 2nd January 2019

క్యు3లో నష్టాలకు అవకాశం క్రూడాయిల్‌ ధరలు పతనం, రిఫైనింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల(ఓఎంసీ) ఎర్నింగ్స్‌ దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ త్రైమాసికంలో సింగపూర్‌ గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం) ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. డిసెంబర్‌లో జీఆర్‌ఎం బ్యారెల్‌కు 4.3 డాలర్లకు పతనమైంది. క్రూడాయిల్‌ ధరలు ఒక్క డిసెంబర్‌లోనే దాదాపు పది శాతం పతనమయ్యాయి. ఈ రెండిటి ప్రభావం ఓఎంసీల పద్దు పుస్తకాలను దెబ్బతీస్తుందని యాంటిక్‌ బ్రోకింగ్‌

డిసెంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

Wednesday 2nd January 2019

- రూ. 94,726 కోట్లకు పరిమితం - నవంబర్‌లో రూ. 97,637 కోట్లు న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు 2018 డిసెంబర్‌లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. 2018 డిసెంబర్ 30 నాటి దాకా మొత్తం 72.44 లక్షల సేల్స్ రిటర్న్‌లు (జీఎస్‌టీఆర్‌-3బీ) దాఖలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు- సెప్టెంబర్

Most from this category