News


చిక్కుల్లో టాటాస్టీల్‌-థిస్సెంక్రప్‌ విలీనం

Saturday 11th May 2019
news_main1557555343.png-25677

  • ఈసీ ఆమోదం కష్టమేనన్న టాటాస్టీల్‌

ముంబై: టాటా స్టీల్‌ తన యూరోప్‌ కార్యకలాపాలను థిస్సెంక్రప్‌తో విలీనం చేయాలన్న ప్రతిపాదన చిక్కుల్లో పడినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. యూరోపియన్‌ కమిషన్‌ ఆందోళనలను తగ్గించే విధంగా ప్యాకేజీపై మళ్లీ కృషి చేసే పరిస్థితి లేదని పేర్కొంది. నష్టాల్లో ఉన్న కోరస్‌ కార్యకలాపాలను టాటా స్టీల్‌, జర్మనీకి చెందిన థిస్సెంక్రప్‌తో విలీనం చేసి చెరిసగం వాటాలతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు గతేడాది ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు యూరోపియన్‌ కమీషన్‌(ఈసీ) ఆమోదం తెలిపాల్సి ఉంది. ఈ సంస్థల విలీనానికి సంబంధించి సమగ్ర ప్యాకేజీని గతేడాది ఏప్రిల్‌లోనే థిస్సెంక్రప్‌ ఈసీకి సమర్పించింది. ‘‘ఈసీ మా ప్రతిపాదిత జాయింట్‌ వెంచర్‌పై చర్చించింది. మాకు అందిన సమాచారం మేరకు కమీషన్‌ మా ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఉద్దేశంతో లేదు. ఎందుకంటే ప్రతిపాదన జాయింట్‌ వెంచర్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించి పెద్ద ఎత్తున పరిష్కార చర్యలను కమీషన్‌ ఆశిస్తోంది’’ అని టాటా స్టీల్‌ తెలిపింది. 



You may be interested

స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Saturday 11th May 2019

సంస్థ విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు- ముంబై: భారీగా రుణాలు బాకీపడిన స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో చుక్కెదురైంది. పరారీలో ఉన్న ప్రమోటర్లు సందేసరా సోదరులతో వన్‌ టైమ్ సెటిల్మెంట్‌కు, సంస్థ దివాలా ప్రక్రియను ఉపసంహరించేందుకు అనుమతించాలని ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకులు వేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. స్టెర్లింగ్ బయోటెక్ విక్రయానికి ఆదేశించింది. గడువులోగా పరిష్కార ప్రణాళిక రాకపోవడంతో తమ ముందు మరో మార్గం

లోన్‌ కావాలా నాయనా!

Saturday 11th May 2019

24 బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీలతో మైలోన్‌కేర్‌ ఒప్పందం గతేడాది వెయ్యి కోట్లు; ఈ ఏడాది రూ.2500 కోట్ల పంపిణీ లక్ష్యం 25 లక్షల మంది కస్టమర్లు; తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం ఇప్పటివకే రూ.8 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణం విషయంలో సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్‌ ప్రతీ ఒక్కటీ కౌంట్‌ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా

Most from this category