STOCKS

News


మరిన్ని ప్రాంతాలకు థైరోకేర్‌

Saturday 22nd September 2018
news_main1537592226.png-20461

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డయాగ్నోస్టిక్‌ ల్యాబ్స్‌ చైన్‌ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లు ఉన్నాయి. 2020 నాటికి వీటి సంఖ్య 60కి చేరుకుంటుందని థైరోకేర్‌ ఫౌండర్‌ డాక్టర్‌ వేలుమణి శుక్రవారమిక్కడ తెలిపారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో కేంద్రానికి కంపెనీ రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 1,000 నగరాలు, పట్టణాల్లో 3,000 ఫ్రాంచైజీల ద్వారా శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. అతితక్కువ వ్యయానికే సేవలు అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నామని వివరించారు. రోజుకు 3,00,000 పరీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు. 
ఫ్రెషర్లకే ఉద్యోగాలు..
కంపెనీ ఉద్యోగులు 1,200 మంది ఉన్నారు. వీరిలో ఫ్రెషర్లే 98 శాతం అని వేలుమణి చెప్పారు. ‘కంపెనీ ఏర్పాటుకు ముందు 50 ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్లినా అనుభవం లేదన్న కారణంతో నన్ను రిజెక్ట్‌ చేశారు. అందుకే ఫ్రెషర్లను మాత్రమే తీసుకోవాలన్నది మా అభిమతం. రెండేళ్లలో శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాలు మరో 7,000 రానున్నాయి. ప్రతి కేంద్రం ద్వారా కనీసం 35 మందికి ఉపాధి లభిస్తోంది. ఫ్రాంచైజీల వద్ద 10,000 పైచిలుకు కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. 2020 నాటికి రూ.600 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. 5 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకున్నాం’ అని పేర్కొన్నారు. 



You may be interested

పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!

Saturday 22nd September 2018

ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరైన సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్‌ పటిష్టంగా ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే... ♦ తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు

ఆసియా మార్కెట్ల ర్యాలీ..

Saturday 22nd September 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తలు అంచనా వేసినంత తీవ్రంగా ఉండవనే అంచనాలు, అమెరికా స్టాక్‌ మార్కెట్‌ రెండు ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలకు చేరుకోవడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 195 పాయింట్ల లాభంతో 23,870 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 16 పాయింట్ల లాభంతో 2,339 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌

Most from this category