STOCKS

News


థామస్‌ కుక్‌ చేతికి డిజిఫొటో

Tuesday 26th February 2019
news_main1551155618.png-24330

  • 51 శాతం వాటా కొనుగోలు 
  • డీల్‌ విలువ రూ.289 కోట్లు 

ముంబై: పర్యాటక సేవలందించే థామస్‌ కుక్‌ ఇండియా గ్రూప్‌...ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌, సేవలందించే డిజిఫొటో ఎంటర్‌టైన్మెంట్‌ ఇమేజింగ్‌(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్‌ కుక్‌ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్‌ కుక్‌ ఇండియా సీఎమ్‌డీ మాధవన్‌ మీనన్‌ తెలిపారు. ప్రస్తుతం 25 దేశాల్లో నిర్వహిస్తున్న పర్యాటక సేవలకు అనుబంధంగా కొత్త అవకాశాలను ఈ కొనుగోలు అందించగలదని పేర్కొ‍న్నారు. సింగపూర్‌, యూఏఈ, హాంగ్‌కాంగ్‌, మకావూ, చైనా, అమెరికా తదితర 14 దేశాల్లో 250 నగరాల్లో 120 మంది భాగస్వాములతో డీఈఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాదిలో 36 లక్షల లావాదేవీలను నిర్వహించిందని పేర్కొన్నారు. థామస్‌ కుక్‌తో అనుబంధం కారణంగా తమ స్థానం మరింత పటిష్టమవుతుందని డీఈఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, కె. రామకృష్టన్‌ తెలిపారు.



You may be interested

జీ వాటా కొనుగోలు రేసులో దిగ్గజాలు

Tuesday 26th February 2019

ముంబై: జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్‌ దిగ్గజం, కామ్‌కాస్ట్‌(అమెరికాలో ఎన్‌బీసీ యూనివర్శల్‌ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకేల్‌ ఏంజెలాకిస్‌ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, ఎటైర్స్‌,  సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్‌ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌,  భారత చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా

ఇక అదానీ ఎయిర్‌పోర్ట్‌లు

Tuesday 26th February 2019

50 ఏళ్ల పాటు నిర్వహణకు ఒప్పందం అత్యధికంగా కోట్ చేసిన అదానీ గ్రూప్ న్యూఢిల్లీ: ప్రైవేట్ దిగ్గజం అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్‌లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. అహ్మదాబాద్‌, తిరువనంతపురం, లక్నో,

Most from this category