News


సింగపూర్‌ సంస్థతో థామస్‌ కుక్ ఒప్పందం

Saturday 11th May 2019
news_main1557555651.png-25679

న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంటోసా డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రావెల్ సేవల సంస్థ థామస్ కుక్ తెలిపింది. మరింత మంది భారతీయ పర్యాటకులను సింగపూర్‌ సందర్శనకు తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. మరోవైపు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ విభాగంలో కూడా ప్రవేశించనున్నట్లు సంస్థ వెల్లడించింది. మరికొద్ది నెలల్లో ఈ విభాగాన్ని ప్రారంభించనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు థామస్‌ కుక్ ఇండియా సీఈవో మహేష్ అయ్యర్‌ తెలిపారు. పేరొందిన పర్యాటక ప్రాంతాల్లో వివాహాలు జరుపుకోవడాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 2,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా.



You may be interested

పీవీఆర్‌ లాభం రెట్టింపు

Saturday 11th May 2019

క్యూలో రూ.48 కోట్లు నమోదు న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌ పీవీఆర్‌ మార్చి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సంస్థ లాభం రెట్టింపై రూ.47.75 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.846 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.26 కోట్లు, ఆదాయం రూ.592 కోట్లుగా ఉన్నాయి. ఎస్‌పీఐ సినిమాస్‌ను కొనుగోలు చేసినందున మార్చి త్రైమాసికం ఫలితాలను, 2018-19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను అంతక్రితం

స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Saturday 11th May 2019

సంస్థ విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు- ముంబై: భారీగా రుణాలు బాకీపడిన స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో చుక్కెదురైంది. పరారీలో ఉన్న ప్రమోటర్లు సందేసరా సోదరులతో వన్‌ టైమ్ సెటిల్మెంట్‌కు, సంస్థ దివాలా ప్రక్రియను ఉపసంహరించేందుకు అనుమతించాలని ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకులు వేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. స్టెర్లింగ్ బయోటెక్ విక్రయానికి ఆదేశించింది. గడువులోగా పరిష్కార ప్రణాళిక రాకపోవడంతో తమ ముందు మరో మార్గం

Most from this category