STOCKS

News


ధోని జోరు.. సీఎస్‌కే షేరు హుషారు..

Tuesday 23rd April 2019
news_main1556017813.png-25298

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీకి, ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి చెప్పక్కర్లేదు. ఈ టీమ్‌ ప్రతి సీజన్‌లో టాప్‌ పొజిషన్లలోనే ఉంటుంది. ఐపీఎల్‌లో బాగా విజయవంతమైన ఫ్రాంచైజీగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను పేర్కొంటారు. ప్రస్తుత సీజన్‌లో కూడా సీఎస్‌కే బాగా రాణిస్తోంది. జట్టు సారధి ధోని నాయకత్వంలో సీఎస్‌కే కోట్ల మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇదంతా క్రికెట్‌ స్టేడియంలో సంగతి. అయితే ధోనీ కారణంగా సీఎస్‌కే ట్రేడింగ్‌ గ్రౌండ్‌లో కూడా అనేకమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటోంది. దీంతో సీఎస్‌కే షేరుకు భారీ గిరాకీ ఏర్పడింది. ఇండియా సిమెంట్స్‌ గతంలో రూ.364 కోట్లకు సీఎస్‌కేను కొనుగోలు చేసింది. 2017-18తో ఈ మొత్తాన్ని చెల్లించడం పూర్తయింది. అనంతరం ఇండియా సిమెంట్స్‌నుంచి సీఎస్‌కేను డీమెర్జర్‌ చేశారు. సీఎస్‌కే లిస్టింగ్‌కు మాత్రం రాలేదు. 2018 నవంబర్‌ వరకు సీఎస్‌కే షేరు రూ. 12-15 మధ్య చేతులు మారుతూ ఉంది. అయితే ఈ నెల ఆరంభం నుంచి షేరు ధర ఒక్కమారుగా దూసుకుపోయి రూ. 30- 35 మధ్య కదలాడుతోందని అన్‌లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరాలు చూసే బ్రోకర్లు చెబుతున్నారు.

తాజా ఐపీఎల్‌లో ధోనీ ప్రదర్శన, సీఎస్‌కే పయనం ఇన్వెస్టర్లకు ఆసక్తి కలిగిస్తున్నాయని, అందుకే షేరు దాదాపు 200 శాతం లాభపడిందని విశ్లేషించారు. మరోవైపు సీఎస్‌కేకు ఇతర మార్గాల్లో సైతం పలు ఆదాయాలు వస్తున్నాయి. స్పాన్సర్‌ షిప్‌ రెవెన్యూ ప్రస్తుతం 40 కోట్ల రూపాయలకు చేరింది. టికెటింగ్‌రెవెన్యూ 60 కోట్ల రూపాయలు దాటింది. ఇదే జోరులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫ్రాంచైజీ రూ. 150కోట్ల లాభం ఆర్జించవచ్చని అభిషేక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. సీఎస్‌కే ప్రస్తుత వాల్యూషన్‌ రూ. 1075 కోట్లుండవచ్చని మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. రెండేళ్ల సస్పెన్షన్‌ అనంతరం కూడా ఈ ఫ్రాంచైజీకి క్రేజ్‌ తగ్గలేదని, నిజానికి సీఎస్‌కేలో బయటపడాల్సిన విలువ ఇంకా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ లిస్టింగ్‌కు వస్తే అత్యంత విజయవంతమవుతుందని మార్కెట్‌ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ షేరు లిస్టింగ్‌కు రాకపోయినా రూ. 100కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. You may be interested

ఈ పది స్టాక్స్‌ బఫెట్‌కు నచ్చుతాయ్‌!?

Wednesday 24th April 2019

లాభాలు పోగేసుకోవాలంటే కచ్చితంగా సరైన స్టాక్స్‌ ఎంపికతోనే సాధ్యపడుతుంది. ఈ విషయంలో ప్రపంచ ప్రముఖ ఇన్వెస్టర్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ సిద్ధ హస్తుడు. వారెన్‌ బఫెట్‌ అన్ని కాలాల్లోనూ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. బెంజమిన్‌ గ్రాహమ్‌కు బఫెట్‌ మాజీ విద్యార్థి కూడా. యాజమాన్యం నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను చూసి ఆయన ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. వీటిల్లోనూ సరసమైన ధరల వద్ద ట్రేడ్‌ అయ్యే

బ్యాంకింగ్‌ కౌంటర్లలో భారీ అన్‌వైండింగ్‌

Tuesday 23rd April 2019

హఠాత్తుగా క్రూడ్‌ ధర 6 నెలల గరిష్టస్థాయికి చేరడం, రూపాయి 69.5 దిగువకు దిగజారడంతో పాటు మరోవైపు వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 38 నెలల గరిష్టస్థాయికి పెరిగిన నేపథ్యంలో ట్రేడర్లు మార్కెట్లో బ్యాంకింగ్‌ కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్లను పెద్ద ఎత్తున అన్‌వైండ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో ముగియనున్నందున, బ్యాంకింగ్‌ షేర్లలో బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా వరుసగా మూడోరోజు బ్యాంక్‌ నిఫ్టీ క్షీణించింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ప్రధాన

Most from this category