News


రతన్‌టాటా పెట్టుబడి సక్సెస్‌!

Sunday 11th November 2018
news_main1541960574.png-21876

స్టార్టప్‌ కంపెనీల్లో టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా పెట్టుబడులు పెడుతుంటారు. పదుల సంఖ్యలో ఇలా ఇప్పటి వరకు ఆయన పెట్టుబడులు పెట్టడం గమనార్హం. అయితే, ఇందులో ఓ టెక్నాలజీ స్టార్టప్‌ ఆయనకు భారీ రాబడులను తెచ్చిపెట్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సిలికాన్‌ వ్యాలీనే కాదు... భారతీయ పట్టణాలు సైతం టెక్నాలజీ కంపెనీల అద్భుతాలకు కేంద్రంగా మారాయంటోంది డెలాయిట్‌ సంస్థ. బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌ 10 టెక్నాలజీ కంపెనీలుగా డెలాయిట్‌ నివేదికలో చోటు సంపాదించుకున్నాయి. ఈ మేరకు డెలాయిట్‌ సంస్థ ‘టెక్నాలజీ ఫాస్ట్‌ 50 ఇండియా’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. 

 

టాప్‌ 10 టెక్నాలజీ సంస్థల ఉమ్మడి ఆదాయాలు 2016లో రూ.18 కోట్లు ఉంటే, 2018లో వీటి ఆదాయం రూ.500 కోట్లకు చేరుకుంది. అవి ఏ స్థాయిలో వృద్ధి చెందాయో తెలియజేస్తోంది. మూడేళ్లలో 28 రెట్లు వృద్ధి చెందినట్టు. వీటిల్లో నోయిడాకు చెందిన బీ2బీ ఈ కామర్స్‌ సంస్థ ‘మోగ్లి ల్యాబ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (మోగ్లిక్స్‌)’ మొదటి స్థానంలో ఉంది. ఈ సంస్థ ఆదాయం రెండేళ్లలో 11,836 శాతం వృద్ధి చెందినట్టు డెలాయిట్‌ తెలిపింది. విశేషం ఏమిటంటే ఈ సంస్థలో రతన్‌ టాటా పెట్టుబడులు కూడా ఉన్నాయి. రతన్‌టాటాతోపాటు ఐఎఫ్‌సీ, మార్క్వీ ఇన్వెస్టర్స్‌ ఈ కంపెనీకి పెట్టుబడులు అందించాయి. ప్రారంభించిన మూడేళ్లలోనే భారత్‌లో అగ్ర స్థాయి బీ2బీ ఈ కామర్స్‌ కంపెనీగా మోగ్లిక్స్‌ అవతరించినట్టు డెలాయిట్‌ ప్రశంసించింది. 

 

మోగ్లిక్స్‌ తర్వాతి స్థానాల్లో... బెంగళూరుకు చెందిన రాజోర్‌పే సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌  11,174 శాతం, ఢిల్లీకి చెందిన మానక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (క్యాషిఫై) 6,853 శాతం, ముంబైకి చెందిన ఒరియానో క్లీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ 3,431 శాతం, బెంగళూరుకు చెందిన ఎలెమెంట్‌42 మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ 905 శాతం, హైదరాబాద్‌కు చెందిన నంబర్‌మాల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 881 శాతం, ముంబైకి చెందిన లాజినెక్ట్స్‌ సొల్యూషన్స్‌ 841 శాతం, కోల్‌కతాకు చెందిన వీడియోనెటిక్స్‌ టెక్నాలజీ 699 శాతం, ఇండోర్‌కు చెందిన సెరోసాఫ్ట్‌ సొల్యూషన్స్‌ 682 శాతం, బెంగళూరుకు చెందిన డిజిటల్‌ ఏపీఐక్రాఫ్ట్‌ 625 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఏడాది ఈ కామర్స్‌ విభాగం నుంచి కంపెనీలు ఆధిపత్యం చూపించినట్టు డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రాజీవ్‌ సుందర్‌ తెలిపారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 12th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 18 పాయింట్ల నష్టంతో 10,604 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ఉన్నాయి. కొస్పి,

ఇకపై మిడ్‌, స్మాల్‌క్యాప్‌ల ర్యాలీ: ఐసీఐసీఐ డైరెక్ట్‌

Sunday 11th November 2018

నిఫ్టీ 10,760 వరకు ప్రస్తుత అప్‌మూవ్‌లో ర్యాలీ చేస్తుందన్న అంచనాను ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయి 10,200ను బ్రేక్‌ చేస్తుందని తాము భావించడం లేదని పేర్కొంది. ఈ మద్దతు స్థాయి వరకూ మార్కెట్‌ దిద్దుబాటుకు గురైతే కనుక నాణ్యమైన స్టాక్స్ కొనుగోలుకు అవకాశంగా వినియోగించుకోవచ్చని సూచించింది. వారం వారీ స్కేల్‌ను గమనిస్తే నిఫ్టీ బలమైన బుల్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని, గరిష్టంలో గరిష్టం, గరిష్ట కనిష్ట

Most from this category