STOCKS

News


ఎయిర్‌బస్‌ ఏ380... గుడ్‌బై!!

Friday 15th February 2019
news_main1550219669.png-24212

  • 2021 నుంచి తయారీ నిలిపివేత
  • కొనేవారు లేకపోవడంతో సంస్థ నిర్ణయం

టౌలౌజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్‌బస్‌ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌బస్‌ తాజాగా ప్రకటించింది. ప్రధాన కస్టమర్‌ అయిన ఎమిరేట్స్‌ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని ఎయిర్‌బస్‌ తన ప్రకటనలో తెలిపింది. 500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌బస్‌ ఏ380ని మార్కెట్లోకి తీసుకొచ్చిన పదేళ్ల తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ నిర్ణయంతో 3,500 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ విమాన తయారీ కారణంగా 2018లో ఎయిర్‌బస్‌కు 463 మిలియన్ల యూరోల నష్టం వచ్చింది. ఇది తమకు బాధాకరమైన నిర్ణయమని ఎయిర్‌బస్‌ సీఈవో టామ్‌ ఎండర్స్‌ అభివర్ణించారు. ఎంతో శ్రమ, ఎన్నో వనరులను వెచ్చించి, కష్టించామని, అదే సమయంలో వాస్తవికంగా వ్యవహరించ తప్పదని చెప్పారాయన. 2008లో తొలిసారి ఏ380 విమానం ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి రాగా, ఎత్తయిన సీలింగ్‌, లాంజెస్‌, డ్యూటీ లేని షాప్‌లు, బార్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



You may be interested

ఇంత నిరాశపూరిత మార్కెట్‌ ఎప్పుడూ చూడలేదు!

Friday 15th February 2019

సంజీవ్‌ భాసిన్‌ మార్కెట్లో ప్రస్తుతం ఉన్నంత నిరాశాపూరిత ధోరణి ఎప్పుడూ చూడలేదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి పరిస్థితులన్నీ ఇప్పుడే కాస్త చక్కబడుతున్నాయని, కొందరు ప్రమోటర్లు చేసిన తప్పుల ఫలితంగా మొత్తం మార్కెట్‌లో నెగిటివ్‌ భావనలు పెరిగిపోయాయని తెలిపారు. ఇప్పుడింత నిరాశ అవసరం లేదన్నారు. ఏప్రిల్‌ చివరకు తప్పకుండా నిఫ్టీ మరోమారు 11600 పాయింట్లను చేరడం తధ్యమని జోస్యం చెప్పారు. ఈ సారి ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌ కూడా

వెలుగులోకి షుగర్‌ షేర్లు

Friday 15th February 2019

కేంద్ర ప్రభుత్వం చక్కెర కనీస అమ్మకం ధర పెంచాలనే నిర్ణయంతో శుక్రవారం షుగర్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. చక్కెర మిల్లులు కిలో చక్కెరను రూ.31 ధరకు తక్కువగా విక్రయించవద్దని గురువారం ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో చక్కెర ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల ఆర్థిక కష్టాలు తీరతున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఈథనాల్ లోన్

Most from this category