STOCKS

News


మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌ పెట్టుబడులు

Friday 7th September 2018
news_main1536296635.png-20047

 ముంబై: నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)లో సింగపూర్‌కు చెందిన టెమసెక్‌ హోల్డింగ్స్‌... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ వెల్లడించింది. దీంతో తమ ఫండ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుజోయ్‌ బోస్‌ చెప్పారు. ఈ ఫండ్‌లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఇన్వెస్ట్‌ చేశాయి. 
త్వరలో స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌...
కొత్త మౌలిక ప్రాజెక్ట్‌లు,  ఇప్పటికే ప్రారంభమై, అగిపోయిన మౌలిక ప్రాజెక్ట్‌లకు నిధులందించేందుకు గాను ప్రభుత్వం ఎన్‌ఐఐఎఫ్‌ను 2015లో ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఐఎఫ్‌లో కేంద్రానికి 49 శాతం చొప్పున వాటా ఉండగా, ఇతర వాటాలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఉన్నాయి. ఎన్ఐఐఎఫ్‌ ఇప్పటికే రెండు ఫండ్స్‌-మాస్టర్‌ ఫండ్‌, ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. మాస్టర్‌ ఫండ్‌ నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా,  ఇతర సంస్థలు నిర్వహించే ఫండ్స్‌లో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది. తాజాగా 200 కోట్ల డాలర్ల నిధులతో మూడో ఫండ్‌-స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూడు ఫండ్ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని సుజోయ్‌బోస్‌ చెప్పారు. కాగా మౌలిక రంగ ఆస్తుల నిర్మాణానికి గాను దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థగా ఎన్‌ఐఐఎఫ్‌ త్వరతిగతిన  అవతరిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. 



You may be interested

జీనోమ్‌ వ్యాలీకి కంపెనీల వెల్లువ

Friday 7th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్‌, లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌ అయిన జీనోమ్‌ వ్యాలీలో కొత్త కంపెనీలు కొలువుదీరుతున్నాయి. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ కంపెనీ జెనెసిస్‌ బయాలాజిక్స్‌ అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఈ సందర్భంగా ప్రారంభించింది. ఈ కేంద్రం కోసం కంపెనీ మొత్తం రూ.350 కోట్లు వెచ్చించనుంది. కెనడాకు చెందిన జనరిక్‌ డ్రగ్‌ కంపెనీ

నీరవ్‌ మోదీ ఉద్యోగికి రెడ్‌ కార్నర్ నోటీసులు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్‌ మోదీ సంస్థకు చెందిన ఉద్యోగి మిహిర్ ఆర్ భన్సాలీపై ఇంటర్‌పోల్ రెడ్‌ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్‌) జారీ చేసింది. అంతర్జాతీయ అరెస్టు వారంటుగా పరిగణించే ఈ నోటీసులో భన్సాలీ (40).. మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్‌పోల్ పేర్కొంది. భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ ఈ ఆర్‌సీఎన్ జారీ చేసింది. పరారీలో ఉన్న భన్సాలీ.. అమెరికా,

Most from this category