STOCKS

News


టెలికం కార్యదర్శితో బిర్లా భేటీ

Friday 23rd November 2018
news_main1542947726.png-22321

న్యూఢిల్లీ: దిగ్గజ టెల్కో వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా గురువారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో మరోసారి భేటీ అయ్యారు. వొడాఫోన్‌ ఐడియా సీనియర్ అధికారులు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వైస్‌-చైర్మన్ హిమాంశు కపానియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలికం రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. అయితే, చర్చల వివరాలను వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. కమ్యూనికేషన్స్ శాఖ వర్గాలతో బిర్లా భేటీ కావడం ఈమధ్య కాలంలో ఇది రెండోసారి. టెలికం పరిశ్రమ తీవ్రంగా నిధుల కొరత ఎదుర్కొంటోందని, వచ్చే ఆదాయం కనీసం వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోయేట్లుగా ఉండటం లేదని బిర్లా ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో స్పెక్ట్రం మొదలైన వాటికి జరపాల్సిన చెల్లింపులకు మరింత గడువు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. 



You may be interested

పెన్నార్‌కు రూ.317 కోట్ల ఆర్డర్లు

Friday 23rd November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్‌ సంస్థ పెన్నార్‌ గ్రూప్‌కు రూ.317 కోట్ల ఆర్డర్‌ దక్కింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌కు సోలిస్‌ ఇంజనీరింగ్, జేఎం ఇన్‌ఫ్రాటెక్, ఐఎఫ్‌బీ, అశోక్‌ లేల్యాండ్, టెకమ్‌సే, వాబ్‌కో, మహీంద్రా, సేలం స్టీల్‌ సంస్థల నుంచి రూ.190 కోట్ల రైల్వే, ట్యూబ్స్, పారిశ్రామిక విడిభాగాల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, పెన్నార్‌ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్‌కు (పెబ్స్‌

7 రోజుల రికార్డు పరుగు!

Friday 23rd November 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పటిష్ట రీతిన బలపడుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో గురువారం ఒకేరోజు 77 పైసలు లాభపడి 70.69 వద్ద ముగిసింది.  రూపాయి రికవరీ బాటన పయనించడం వరుసగా ఇది ఏడవరోజు. ఈ కాలంలో భారీగా 220 పైసలు లాభపడింది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను భారీగా విక్రయించడం కొనసాగిస్తున్నారు.  గురువారం రూపాయి ప్రారంభంతోటే 71.12 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.68 వద్దకూ

Most from this category