STOCKS

News


120 కోట్లు దాటిన టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

Thursday 21st March 2019
Markets_main1553163398.png-24736

- జనవరి వృద్ధిరేటు 0.49 శాతం

న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్ర్కైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7 కోట్లు కాగా, ఈ జనవరిలో 0.49 శాతం వృద్ధి నమోదైంది. రిలయన్స్‌ జియో ఈ కాలంలో కొత్తగా 93 లక్షల నూతన కస్టమర్లను జతచేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 9.82 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్‌ లక్ష కొత్త యూజర్లను సొంతం చేసుకున్నాయి. ఇక వొడాఫోన్‌ ఐడియా 35.8 లక్షల కస్టమర్లను కోల్పోగా.. టాటా టెలీసర్వీసెస్‌ 8.4 లక్షల యూజర్లను కోల్పోయింది. మరోవైపు దేశీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 4.15 శాతం వృద్ధితో 54 కోట్లకు చేరుకున్నాయి.



You may be interested

120 కోట్లు దాటిన టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

Thursday 21st March 2019

- జనవరి వృద్ధిరేటు 0.49 శాతం న్యూఢిల్లీ: టెలికం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో మరోసారి 120 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మార్కును మించి సబ్‌స్ర్కైబర్లు జతకావడం ఇది మూడవసారని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. 2017 జూలై, 2018 మే తరువాత 120 కోట్లు మార్కును చేరడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.7

భారతీ రియాల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

Thursday 21st March 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఏరోసిటీ కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్‌ డిస్ట్రిక్ట్స్‌లో డిజైన్‌, డెవలప్‌, ఫైనాన్స్‌, కన్‌స్ట్రక్ట్‌, ఆపరేట్‌, మేనేజ్‌, మెయింటెయిన్‌ ప్రాతిపదికన ఫేజ్‌-1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్‌-2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్‌-1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036

Most from this category