STOCKS

News


ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఈ-కేవైసీ..!

Thursday 11th October 2018
news_main1539231892.png-21037

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగకూడదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆపరేటర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఆధార్‌కు బదులుగా ఈ-కేవైసీ ధృవీకరణకు అనుమతి ఇవ్వాలని టెలికాం శాఖ (డాట్‌)ను కోరారు. వెరిఫికేషన్‌ కోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ (యాప్‌)ను రూపొందిచిన ఆపరేటర్లు.. పేవర్‌ వర్క్‌ లేకుండా, క్షణాల్లోనే ధృవీకరణ పూర్తయ్యే విధంగా టెక్నాలజీని వివరించారని టెలికాం అపెక్స్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (యాక్ట్‌) ఒక లేఖ ద్వారా డాట్‌కు తెలియజేసింది. సిమ్‌ కార్డు విక్రయించే వ్యక్తే కస్టమరు ఫోటోను మొబైల్‌ ద్వారా తీసుకుని, సంబంధిత పత్రాలను జతచేసే విధంగా నూతన టెక్నాలజీ ఉండనుందని తెలిపింది. ఇందుకు అనుగుణంగా డాట్‌ మార్గదర్శకాలలో పలు మార్పులు అవసరమని లేఖలో పేర్కొంది. 



You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా రాకేశ్‌ శర్మ బాధ్యతలు!

Thursday 11th October 2018

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండీ, సీఈఓ)గా బుధవారం రాకేశ్‌ శర్మ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌ 5న ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా శర్మ పేరును కేంద్రం ప్రకటించింది. ఆరు నెలలు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 2015 సెప్టెంబర్‌ 11 నుంచి 2018 జూలై 31వ తేదీ వరకూ శర్మ కెనరాబ్యాంక్‌ ఎండీ, సీఈఓగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అంతకుముందు 2014 ఏప్రిల్‌

బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి ఎఫ్‌డీఐలు!

Thursday 11th October 2018

న్యూఢిల్లీ:  ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌తోపాటు బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ)  ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఆర్థికశాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగా ఉంది. దీనిని 100 శాతం పెంచడంపై ఆర్థికశాఖ ఐఆర్‌డీఏఐ సలహా

Most from this category