STOCKS

News


టాప్‌-5లో హైదరాబాద్‌:సెనైజర్‌

Thursday 20th December 2018
news_main1545282984.png-23095

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆడియో ఉపకరణాల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం సెనైజర్‌ ఎలక్ట్రానిక్స్‌కు భారత్‌లో టాప్‌-5 మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ మార్కెట్‌ 25 శాతం వృద్ధి నమోదు చేసిందని కంపెనీ ప్రొఫెషనల్‌ విభాగం డైరెక్టర్‌ విపిన్‌ పుంగాలియా బుధవారం తెలిపారు. నూతన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాదిన తొలి స్థానం భాగ్యనగరిదేనని చెప్పారు. ‘సెనైజర్‌ అమ్మకాల్లో భారత మార్కెట్‌ మొదటి అయిదు స్థానాల్లో ఉంది. ప్రొఫెషనల్‌ విభాగంలో 22 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకున్నాం. దేశంలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించాం. ఆర్‌అండ్‌డీతోపాటు తయారీ కేంద్రం నెలకొల్పాలన్న ఆలోచనలో కంపెనీ ఉంది. ప్లాంటు ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రభుత్వం సెనైజర్‌ను ఆహ్వానించింది. యూనిట్‌ స్థాపించాలని నిర్ణయం తీసుకుంటే తప్పకుండా తెలంగాణను పరిశీలిస్తాం’ అని వివరించారు.



You may be interested

వాహనాలకు ‘ఎలక్ట్రిక్‌’ షాక్‌!!

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారుల నెత్తిన త్వరలో మరింత పన్ను పోటుకు రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా.. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్సు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ద్విచక్రవాహనాలు మొదలుకుని కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల దాకా అన్నింటిపై సుమారు రూ. 500- రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనుంది.

బ్యాంకులకు 5 రోజులు వరుస సెలవులు

Thursday 20th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వరుస సెలవులు, సమ్మెల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు 5 రోజులు నిలిచిపోనున్నాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. 24వ తేదీ (సోమవారం) బ్యాంకులు తెరుస్తారు. 25వ తేదీ క్రిస్మస్‌ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌

Most from this category